»Sadhguru Shares Health Update After Brain Surgery In New Video
Jaggi Vasudev : హెల్త్ అప్డేట్ ఇచ్చిన సద్గురు జగ్గీ వాసుదేవ్
బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న సద్గురు జగ్గీ వాసుదేవ్ తొందరగా కోలుకుంటున్నారు. ఆసుపత్రి బెడ్‌పై కూల్‌గా పేపర్ చదువుకుంటూ ఉన్న ఒక వీడియోని ఆయన షేర్ చేశారు.
Sadhguru Health Update : ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సద్గురు జగ్గీ వాసుదేవ్ బ్రెయిన్ సర్జరీ తర్వాత వేగంగా కోలుకుంటున్నారు. ఆయన హెల్త్ అప్డేట్ని ఆయన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారన్న దానిపై ఓ చిన్న వీడియో క్లిప్‌ని అందులో పోస్ట్ చేశారు. ఆ వీడియో క్లిప్‌లో ఆయన ఆసుపత్రి బెడ్ మీద కూర్చుని ఇంగ్లీష్ పేపర్ చదువుకుంటూ కనిపించారు.
స్పీడీ రికవరీ అంటూ ఆ వీడియో క్లిప్‌కి క్యాప్షన్ జోడించారు. 66 ఏళ్ల జగ్గీ వాసుదేవ్(Brain Surgery) గత నాలుగు వారాల నుంచి తీవ్రమైన తలనొప్పితో బాధ పడుతున్నారు. అయినప్పటికీ ఈ నెల 8న జరిగిన శివరాత్రి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఈ నెల 17న మెదడులో భారీ వాపు, రక్త స్రావం కావడంతో వెంటనే ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అదే రోజు వైద్యుల బృందం ఆయన మెదడుకు విజయవంతంగా శస్త్ర చికిత్స (Brain Surgery) నిర్వహించింది.
అప్పటి నుంచి ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. వేగంగా కోలుకుంటున్నట్లు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేదానిపై ఆయన కుమార్తె రాధే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉన్నారు. దీంతో కాస్త కూల్‌గా కనిపించిన సద్గురు(Sadhguru) వీడియో చూసిన ఫాలోవర్స్ ఆయన తొందరగా కోలుకుని క్షేమంగా బయటకు రావాలని కామెంట్లు చేస్తున్నారు.