»Trumps Net Worth Hits 6 5 Bn Making Him One Of Worlds 500 Richest
Trump : ప్రపంచ 500 మంది సంపన్నుల జాబితాలో ట్రంప్!
డొనాల్డ్ ట్రంప్ కంపెనీలకు సంబంధించిన ఒక అతి పెద్ద డీల్ ఓకే అవ్వడంతో ఆయన నెట్‌వర్త్ ఒక్కసారిగా 6.5 బిలియన్ డాలర్లకు పెరిగిపోయింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన 500 మందిలో ఆయనకు స్థానం దక్కింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Donald Trump : డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్లుండి ప్రపంచ సంపన్నుల్లో ఒకరుగా రికార్డులకెక్కారు. బ్లూమ్‌బర్గ్ ప్రపంచ సంపన్నుల జాబితాలో 500 మందిలో ఆయనకు స్థానం దక్కింది. ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న ఆయన కంపెనీ డీల్ ఒకటి పూర్తవడంతో ఆయన నెట్‌వర్త్ ఒక్కసారిగా 4 బిలియన్ డాలర్లు పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు ఆయన సంపద 6.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గతంలో ఎప్పుడూ కూడా ఆయన ఆస్తుల విలువ ఈ స్థాయిలో పెరగలేదని యూఎస్ఏ టుడే పేర్కొంది.
ట్రంప్‌నకు(Trump) చెందిన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ సంస్థ…. డిజిటల్ వరల్డ్ అక్విజేషన్ కార్ప్(Digital World Acquisition Corp(DWAC))తో విలీనం అయింది. ఈ ఒప్పందంపై చర్చలు దాదాపుగా 29 నెలలుగా కొనసాగుతున్నాయి. ఈ విలీనం ఖరారు కావడంతో డీడబ్ల్యూఏసీ(DWAC) షేర్లు 35 శాతానికి పైగా పెరిగి మార్కెట్లో ర్యాలీ చేశాయి. దీంతో ట్రంప్ సంపద కూడా భారీగా పెరిగి6.5 బిలియన్ డాలర్లకు చేరినట్లు సీఎన్‌బీసీ పేర్కొంది.
ఈ రెండు కంపెనీల విలీనం తర్వాత ఏర్పడ్డ కొత్త కంపెనీ డీజేటీ. ఇది నేటి నుంచి నాస్డాక్లో ట్రేడింగ్ కానుంది. ఈ కొత్త కంపెనీలో వాటాలను ట్రంప్ కనీసం ఆరు నెలల పాటు విక్రయించకుండా ఉండాల్సి ఉంటుంది.