»Four Men Charged In Attack Showing Signs Of Beatings At Hearing As Court Says Two Accept Guilt
Moscow : ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు వీరే.. మీడియాకు చూపించిన రష్యా
రష్యా రాజధాని మాస్కోలోని కాన్సర్ట్ హాల్లో గుమిగూడి ఉన్న జనంపై కాల్పులు జరిపి 60 మంది మృతికి కారణమైన ఉగ్రవాదులను పారిపోయే సమయంలో పోలీసులు పట్టుకున్నారు. వారిని కోర్టుకు హాజరు పరిచిన సమయంలో అద్దాల గదిలో ఉంచి మీడియాకు చూపించారు.
Moscow concert hall shooting : మాస్కోలోని కాన్సర్ట్ హాల్లో జరిగిన భీకర ఉగ్రదాడి ( concert hall attack) యావత్ ప్రపంచాన్ని కలవర పరిచింది. ఆ ఘటనలో కాల్పుల తర్వాత పారిపోతున్న నలుగురు ముష్కరులను రష్యన్ పోలీసులు పట్టుకున్నారు. వారిని కోర్టుకు హాజరు పరిచినప్పుడు అద్దాల గదిలో ఉంచి మీడియాకు చూపించారు. బాగా దెబ్బలు తిని, కరెంట్ షాక్‌లకు గురైనట్లుగా వారి వాలకం మీడియాకు కనిపించింది.
సోమవారం ఈ నలుగురినీ బాస్మనీ జిల్లా న్యాయస్థానంలో(court) హాజరుపరిచారు. వీరు కోర్టు ముందు తాము చేసిన నేరాన్ని అంగీకరించారు. నలుగురు ఉగ్రవాదులో ఒకరి చెవి కోసేసి ఉండటాన్ని మీడియా గమనించింది. ఒక ఉగ్రవాది అసలు మాట్లాడే పరిస్థితుల్లో లేడు. కోర్టులో హియరింగ్ జరుగుతున్నంత సేపు అతను చక్రాల కుర్చీలో కళ్లు మూసుకునే పడుకుని ఉన్నట్లు కనిపించాడు. మరో ఇద్దరు కూడా బాగా దెబ్బలు తిని ఉన్నట్లుగా కనిపించారు. వారికి కరెంట్ షాక్ ఇవ్వడం ద్వారా విచారణాధికారులు తీవ్రంగా హింసించి ఉంటారని అంతర్జాతీయ మీడియాల్లో వార్తలు వెలువడుతున్నాయి.
కాల్పులు జరిగిన తర్వాత మొత్తం ఏడుగురు అనుమానితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఈ నలుగురు ఉన్నారు. దలెర్దజొన్ మిర్జొయెవ్, సైదక్రామి రచబలిజొద, షంసిదున్ ఫరీదుని, ముఖమ్మద్ సొబిరి షైజొవ్లుగా వారి పేర్లను వెల్లడించారు. వీరి ఆఫ్గనిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న ఇస్లమిక్ స్టేట్ ఖొరాసాన్ ఉగ్ర ముఠాకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు.