తిరుమల (Tirumala) వెళ్లే భక్తులకు టీటీడీ అలర్ట్ ప్రకటించింది. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈ నెల 28న మూసి వేయనున్నారు. సుమారు 8 గంటలపాటు ఆలయ తలుపులు మూసి ఉంచనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ నెల 29న తెల్లవారుజామున 1.05 నుంచి 2.22 గంటల మధ్య గ్రహణం కాలం ఉండనుంది. అయితే చంద్ర గ్రహణం (Lunar eclipse) సమయానికి 6 గంటల ముందే తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తుండడంతో 28న రాత్రి 7.05 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నారు.
ఈ నేపథ్యంలో 28వ తేదీన రాత్రి 7.05 గంటలకు ఆలయ తలుపులు మూసి వేయనున్నట్లు స్పష్టం చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ (TTD) అధికారులు కోరారు. తిరిగి గ్రహణం విడిచిన అనంతరం అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3:15 గంటలకు ఆలయానికి సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. స్వామివారి ఆలయ ఏకాంతంలో శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరుస్తారు. అంటే చంద్రగ్రహణం కారణంగా శనివారం సాయంత్రం నుంచి తెల్లవారు జామున వరకూ దాదాపు ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసివేస్తారు. ఈ నేపథ్యంలో శీవారి సహస్ర దీపాలంకార (Dipalankara)సేవ తో పాటు వికలాంగులు, సీనియర్ సిటిజన్ల దర్శనాలను అక్టోబర్ 28న రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.