Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 May 24th)..మిక్కిలి శ్రద్ధ అవసరం.
ఈ రోజు(2024 April 24th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
మొదలుపెట్టిన పనులు వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. కొత్త వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అప్పులు తొలగిపోతాయి. ధైరసాహసాలతో ఉంటారు.
వృషభం
ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. అనారోగ్యబాధలు స్పల్పంగా ఉంటాయి. వృధాప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. సన్నిహితులతో విరోధం ఏర్పడే అవకాశం ఉంది.
మిథునం
అనారోగ్య బాధలు ఎక్కువౌతాయి. అకారణంగా కలహాలు ఏర్పడుతాయి. భయాందోళనకు లోనవుతారు. విద్యార్థులకు శ్రద్ధ అవసరం. అన్ని రంగాలవారు జాగ్రత్తగా ఉండటం మంచిది. స్త్రీలు పిల్లలపట్ల మిక్కిలి శ్రద్ధ అవసరం.
కర్కాటకం
మొదలు పెట్టిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. అనుకోని కలహాలకు అవకాశం ఉంటుంది. ధననష్టాన్ని అధిగమించడానికి అప్పులు చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు గమనిస్తారు.
సింహం
కోరుకునేది ఒకటైతే జరిగేది ఇంకోటి. అనారోగ్య బాధలు వేదిస్తాయి. సమయానికి భుజించడానికి ప్రాధాన్యమిస్తారు. కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనోనిగ్రహాంతో ఉండడానికి ప్రయత్నించాలి. పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధ చూపరాదు.
కన్య
మీమీరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. సన్నిహితులను కలవడంలో విఫలమవుతారు. అనవసరంగా ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఉంటాయి. స్త్రీలమూలకంగా ధనలాభం ఉంది. ఊహించనికార్యాల్లో పాల్గొంటారు.
తుల
ఆకస్మిక ధనలాభం ఉంది. రాజకీయరంగంలోని వారికి, క్రీడాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఎంచుకున్న పనుల్లో విజయాన్ని సాధిస్తారు. సన్నిహితులను కలుస్తారు. శుభవార్తలు వింటారు.
వృశ్చికం
ఈ రాశివారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. భయాందోళనలు దూరమవుతాయి. అప్పులు ఆలస్యంగా లభిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి కరువు అవుతుంది. బంధు, మిత్రులతో గొడవలు ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది.
ధనుస్సు
శుభకార్యలు చేపడుతారు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి సరదాగా విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం ఉంది. కొత్త వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తిచేసుకుంటారు.
మకరం
కొత్తపనులు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అకాలభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు నిజాలు చెప్పడం మంచిది. అనవసర భయాందోళనలకు గురి అవుతారు.
కుంభం
అపకీర్తి రాకుండా జాగ్రత్త పడాలి. మనోల్లాసాన్ని అనుభవిస్తారు. సోదరులతో కలహాలు ఏర్పడకుండా మెలగాలి. మొదలుపెట్టిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా వైదొలుగుతాయి.
మీనం
అనుకోని ధనలాభం ఉంది. కొత్తగా వస్తు, ఆభరణాలు పొందుతారు. సమాజాంలో కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. రుణబాధలు తొలగిపోతాయి.