టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ (Suryakumar) సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నరు. తిరుమల (Tirumala) తిరుపతి దేవస్థానాన్ని సందర్శించి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సూర్యకుమార్ యాదవ్ దంపతులను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ (Suryakumar) సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నరు. తిరుమల (Tirumala) తిరుపతి దేవస్థానాన్ని సందర్శించి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సూర్యకుమార్ యాదవ్ దంపతులను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. అయితే.. అక్కడున్న భక్తులు (devotees) అతనితో స్పెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. దీంతో సూర్యకుమార్ దంపతులు కాస్త ఇబ్బంది పడ్డారు. దైవభక్తి ఎక్కువగా ఉన్న సూర్యకుమార్ యదవ్.. దేశంలోని ప్రముఖ దేవాలయాలను ఇప్పటికే చాలా వరకు సందర్శించాడు. ఇటివల తిరువనంతపురం (Thiruvananthapuram) లో మ్యాచ్ సందర్భంగాపద్మనాభస్వామివారిని దర్శించుకున్న సూర్య.. ఇప్పుడు ఆస్ట్రేలియాతో (Australia )మూడో టెస్టుకు కాస్త సమయం లభించడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సతీసమేతంగా వచ్చాడు. ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ (Nagpur) వేదికగా జరిగిన తొలి టెస్టుతో సాంప్రదాయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి సూర్య.. రెండో టెస్టు ఆడలేదు. అయితే.. చివరి రెండు టెస్టులకు కూడా సూర్యను ఎంపిక చేయడంతో సూర్యకు మరో అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. టెస్టుల్లో సూర్యకు అంత మంచి రికార్డు లేకపోయినా.. టీ20 క్రికెట్లో మాత్రం అతనే వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్నాడు. మూడో టెస్ట్ మార్చి 1 నుంచి ప్రారంభంకానుంది. అయితే మూడో టెస్ట్‌కు సమయం ఉండటంతో శ్రీవారి దర్శనానికి వచ్చారు సూర్యకుమార్ యాదవ్.