అంగరంగ వైభవంగా అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన ఆరు రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలోని రామ్ జానకి టెంపుల్‌ను పేల్చేస్తామని పోస్టర్లు వెలిశాయి.
Bomb Threat: అంగరంగ వైభవంగా అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన ఆరు రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలోని రామ్ జానకి టెంపుల్‌ను పేల్చేస్తామని పోస్టర్లు వెలిశాయి. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ ఆలయం గోడలపై పోస్టర్లు కనిపించడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ బాంబు బెదిరింపు పోస్టర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భక్తులు అటు వైపు వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే బీజేపీ లీడర్ రోహిత్ సాహును కూడా చంపుతామని హెచ్చరించారు. రోహిత్ ఈ దేవాలయం ట్రస్ట్‌గా కొనసాగుతున్నారు.