Visakapatnam: విశాఖపట్నం జిల్లా మధురవాడ బక్కన్నపాలెంకు చెందిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. వైజాగ్‌కు చెందిన సాయికుమార్ పెళ్లి వేడుకలకు ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తుంటాడు. కోనసీమ జిల్లా రావులపాలెం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు పదిరోజుల షూట్ ఉందని గత నెల 26న పిలిచారు. దీంతో యువకుడు ఇంట్లో చెప్పి రావులపాలెం వెళ్లాడు. రాజమండ్రి రైల్వేస్టేషన్లో దిగిన తర్వాత ఆ ఇద్దరు యువకులు వచ్చి సాయికుమార్‌ను కారులో రావులపాలెం తీసుకెళ్లి హత్య చేసి అక్కడే పూడ్చిపెట్టారు.
ఆ తర్వాత అతని దగ్గర ఉన్న కెమెరా, సామగ్రిని తీసుకెళ్లారు. సాయికుమార్ ఫోన్ స్విచ్ఆఫ్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి ఫోన్ కాల్‌డేటా ఆధారంగా నిందితులను గుర్తించారు. కేవలం కెమెరా, సామగ్రి కోసమే సాయికుమార్‌ను హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఆ కెమెరా విలువ దాదాపు రూ.15 లక్షలు ఉంటుందని సమాచారం.