అధికారాన్ని అడ్డు పెట్టుకుని కొంత మంది పోలీసులు తమ వికృత చేష్టలను బయటపెడుతుంటారు. ఈ నేపథ్యంలోనే అమ్మాయిలను టార్గెట్ చేసి వారిని లోబరుచుకుంటారు. అలాంటి ఓ పోలీసు చీకటి కోణాన్ని తన భార్య బయటపెట్టి అతను అరెస్టు అయ్యేలా చేసింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ప్రమాదం ఎటు నుంచైనా పోంచి ఉండోచ్చు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని పెద్దలు అంటుంటారు. ఈ వీడియో చూస్తే నిజమే అనిపిస్తుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని సార్లు ప్రమాదాలు జరుగుతాయి. ఫుట్ పాత్‌పై నడుచుకుంటు వెళ్తున్న వ్యక్తులపై కూడా కారు దూసుకెళ్లింది. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.
హైదరాబాద్లో మీరు ఇల్లు కట్టుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే పర్మిషన్ కోసం లక్ష రూపాయలు రెడీ చేసుకోండి. అదెంటీ అనుమతి కోసమే అంత అమౌంట్ ఇవ్వాలా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే తాజాగా సరూర్ నగర్ పరిధిలో ఓ అధికారి ఇదే విషయంలో లక్షన్నర లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
అయోధ్య రామమందిరం ప్రాంతంలో పూజారి హత్య కలకలం రేపింది. హనుమాన్ ఆలయంలోని పూజారిని గొంతు కోసి హత్య చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పూజారి శిష్యులు పరారీలో ఉండటంతో వారి కోసం గాలిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు ఎల్లప్పుడూ జరుగుతుంటాయి. మ్యాచ్‌ల టైమ్ అంటే ఇంకా ఎక్కువగా జరుగుతాయి. ఇలాంటి సమయంలో ఓ ఎస్సై బెట్టింగ్ ద్వారా కోటిన్నర గెలుచుకుని సస్పెన్షన్‌కు గురయ్యాడు.
సమాజ్ వాది పార్టీ సీనియర్ నేత అజమ్ ఖాన్, అతని భార్య, కుమారుడికి కోర్టు షాక్ ఇచ్చింది. ఫేక్ సర్టిఫికెట్ల కేసులో ఒక్కొక్కరికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఒక్క నెలలోనే అజమ్ ఖాన్ 4 కేసుల్లో దోషిగా తేలాడు. మరోవైపు అతని కుమారుడు రెండు కేసుల్లో దోషిగా ఉన్నాడు.
దాదాపు రూ.6 కోట్ల విలువ చేసే బంగారం చోరీకి గురైంది. మణప్పురం గోల్డ్ లోన్ బ్రాంచ్‌లోనే ఈ ఘటన జరగడం స్థానికుల్లో కలవరం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భర్త తనకు ఇష్టమైన సీరియల్ చూడొద్దన్నాడని, ఛానెల్ మార్చమన్నాడని ఓ భార్య పుట్టింటికి అలిగి వెళ్లిపోయింది. భార్య వెళ్లిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.