»Iraq Roadside Bomb Attack 10 People Killed And 14 Injured
Bomb attack: 10 మంది మృతి, 14 మందికి గాయాలు
ఇరాక్‌లోని తూర్పు దియాలా ప్రావిన్స్‌లో గురువారం సాయంత్రం ఒక వాహనం, రెస్క్యూ టీమ్‌పై బాంబు దాడి జరిగింది. రోడ్డు పక్కన ఉన్న పలువురిపై దుండగులు బాంబులపై దాడి చేసి, కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది మరణించగా..14 మంది గాయపడ్డారు.
iraq Roadside bomb attack 10 people killed and 14 injured
ఇరాక్(iraq)లోని తూర్పు దియాలా ప్రావిన్స్‌లోని అమ్రానియా నగరం సమీపంలో గురువారం (నవంబర్ 30) సాయంత్రం ఒక వాహనం, రెస్క్యూ టీమ్‌పై బాంబు దాడి(bomb attack) జరిగింది. రోడ్డు పక్కన బాంబులు, బుల్లెట్లతో దాడి చేశారని, ఈ ఘటనలో దాదాపు 10 మంది మృతి చెందగా, 14 మంది గాయపడ్డారని రాయిటర్స్ తెలిపింది. ఇరాక్‌లోని అమ్రానియా నగరం సమీపంలో జరిగిన దాడిలో స్థానిక ఎంపీ బంధువులు లక్ష్యంగా చేసుకున్నట్లు భద్రతా బలగాలకు సంబంధించిన వర్గాలు తెలిపాయి.
At least 10 people have been killed, and 14 others were wounded in a roadside bomb attack in al-Amraniya in Diyala, Iraq pic.twitter.com/g6JuZuOQpI
అనేక మంది వ్యక్తులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ధ్వంసం చేసి, రోడ్డు పక్కన బాంబులు పేల్చడంతో ఈ ఘటన ప్రారంభమైందని ఆయా వర్గాలు తెలిపాయి. ఆ సమయంలో, గుర్తు తెలియని వ్యక్తులు వారిపై బాంబులతో దాడి చేసి, స్నిపర్ కాల్పులు(firing) కూడా చేశారని వెల్లడించారు. దాడికి గల కారణాలను ఆయన వివరించలేదు. అయితే దాడి అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.
అక్టోబర్ 2023 చివరి రోజుల్లో ఇరాక్ రాజధాని బాగ్దాద్(baghdad)లో దాడి జరిగింది. అక్టోబర్ 27న రెడ్ క్రాస్ హెడ్ క్వార్టర్స్, పోలీస్ స్టేషన్ల దగ్గర ఈ దాడి జరిగింది. ఇందులో 33 మంది చనిపోయారు. ముందు రోజు రాత్రి వేర్వేరు దాడుల్లో ముగ్గురు అమెరికన్ సైనికులు మరణించిన తర్వాత ఈ దాడి జరిగింది. ఇరాక్‌పై బాంబు దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది డిసెంబర్లో, ఉత్తర-మధ్య ఇరాక్‌లోని కిర్కుక్ నగరానికి సమీపంలో జరిగిన బాంబు దాడిలో కనీసం తొమ్మిది మంది ఫెడరల్ పోలీసు అధికారులు మరణించారు. కిర్కుక్కు నైరుతి దిశలో దాదాపు 30 కి.మీ (20 మైళ్లు) దూరంలో ఉన్న సఫ్రా గ్రామ సమీపంలో పోలీసుల కాన్వాయ్‌పై దాడి జరిగింది.