రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రాంతంలోని సోలిపూర్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన లారీని వేగంగా వచ్చిన బొలేరో ఆకస్మాత్తుగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా..ఒకరికి గాయాలయ్యాయి. శనివారం ఉదయం బెంగళూరు హైవేపై హైదరాబాద్ నుంచి కర్నూల్ వైప్ వెళ్తున్న బొలేరో వాహనం అదుపుతప్పి డివైడర్ పైకి ఎక్కి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగ...
తిరుమల నడక మార్గంలో బాలుడిపై దాడి చేసిన చిరుతను అటవీ అధికారులు బంధించారు. 24 గంటల్లో ఆ చిరుతను బంధించామని డీఎఫ్‌వో తెలిపారు.
విద్యుత్ వైరును దొంగిలించారనే ఆరోపణపై పోలీసులు కొందరు దుర్మార్గులను వెంబడించారు. ఇంతలో పోలీసులను చూసి ఓ దుండగుడు ఫ్లై ఓవర్‌పై నుంచి దూకాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. నేరస్థుడిని ఆసుపత్రిలో చేర్చారు, కాని వైద్యులు అతని ప్రాణాలను రక్షించలేకపోయారు.
టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు రోజుల పాటు ఆయన్ని పోలీసులు విచారించారు. విచారణలో ఆయన మొత్తం 12 మంది పేర్లను బయటపెట్టారు. దీంతో టాలీవుడ్ సెలబ్రిటీలలో టెన్షన్ మొదలైంది.
ఇద్దరు విద్యార్థులు తమ ట్యూషన్ టీచర్ పై తుపాకీతో కాల్పులు జరిపారు. గత కొన్ని రోజులుగా పెండింగ్ ట్యూషన్ ఫీజును చెల్లించమంటూ టీచర్ అడగటంతో విద్యార్థులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రస్తుతం కాల్పులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ యువతి ఫ్రెండ్ కదా అని స్నేహితుడితో వీడియో కాల్ మాట్లాడింది. చివరికీ ఆమె పెళ్లి క్యాన్సిల్ అవడానికి ఆ కాల్ కారణమైంది.
భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఫేస్ బుక్ లైవ్ పెట్టి మరీ బలవన్మరణానికి పాల్పడింది. తన కుమారుడిని ఒంటరిని చేసింది.
పింక్ వాట్సాప్(Pink Whatsaap) పేరుతో సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండే వారినే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. పాత దానికి అప్ గ్రేడ్ వర్షన్ అని ఇందులో బోలెడన్ని ఆప్షన్లు ఉన్నాయని కేటుగాళ్లు ఊదరగొడతారు.
టైటానిక్ షిఫ్ శకలాలు చూసేందుకు వెళ్లిన ఐదుగురు పర్యాటకులు జల సమాధి అయ్యారు. టైటాన్ సబ్ మెర్సిబుల్ తీవ్ర ఒత్తిడికి గురై పేలిపోయిందని అమెరికా కోస్ట్ గార్డ్ ధృవీకరించింది.
మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఏ1, ఏ2 నిందితులుగా రామోజీరావు, శైలజా కిరణ్ లను గుర్తిస్తూ సీఐడీ నోటీసులిచ్చింది. జులై 5వ తేదిన వారు గుంటూరులో విచారణకు రావాలని కోరింది.
ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్(pithoragarh)లో ఘోర ప్రమాదం(accident) చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బొలెరో వాహనం ఆకస్మాత్తుగా పల్టీ కొట్టి కాలువలో పడింది.
గేట్ ఇంజినీరింగ్ కాలేజీ సెక్రటరీ కాంతారావుపై హత్యాయత్నం జరిగింది. కాలేజీ పార్ట్నర్స్ తనను చంపేందుకు సుఫారీ ఇచ్చారని కోదాడ పోలీసులకు కాంతారావు ఫిర్యాదు చేశారు.
కేరళలో ఓ వ్యక్తి జడ్జీ కారుపై తన ప్రతాపం చూపించాడు. తన విడాకుల కేసులో వాదనలు వినడం లేదని ఆగ్రహాంతో ఊగిపోయాడు. కోర్టు బయట కనిపించిన కారు అద్దాలు పగలగొట్టి తన కోపాన్ని తీర్చుకున్నాడు.
గ్వాలియర్‌లో కదులుతున్న రైలులో ఓ మహిళపై ఐదుగురు దుండగులు అత్యాచారానికి ప్రయత్నించారు. ఇందులో విఫలమవడంతో మహిళతో పాటు ఆమె బంధువును రైలు నుంచి కిందకు తోసేశారు.
డ్రాగన్ బోట్ ఫెస్టివల్‌కు ముందు ఈ పేలుడు సంభవించింది. ప్రజలు పండుగ కోసం సిద్ధమవుతున్నారు, అకస్మాత్తుగా పేలుడు సంభవించినప్పుడు తొక్కిసలాట జరిగింది.