»Horrible 8 People Including A Child Were Burnt Alive
UP Road Accident : ఘోరం.. చిన్నారి సహా 8 మంది సజీవదహనం
ఘోర ప్రమాదంలో 8 మంది దుర్మరణం చెందారు. చిన్నారితో సహా 8 మంది సజీవదహనం అయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివాహ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ దారుణం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)లో చిన్నారి సహా 8 మంది సజీవదహనం అయిన ఘటన ఉత్తరప్రదేశ్ (Uttarapradesh)లో చోటుచేసుకుంది. బరేలీ ప్రాంతంలో జాతీయ రహదారిపై వెళ్తున్న ట్రక్కు, కారు ఢీకొన్నాయి. ఆ సమయంలో కారులో మంటలు చెలరేగడంతో చిన్నారి సహా 8 మంది ప్రాణాలు (8 members died) విడిచారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కారులో ఏడుగురు పెద్దలు, ఒక చిన్నారి దగ్ధమైనట్లుగా పోలీసులు వెల్లడించారు.
ప్రమాద స్థలంలోని సీసీఫుటేజ్ను పోలీసులు పరిశీలించారు. ప్రమాదం జరగడానికి ముందుగా కారు డోర్లు జామ్ అయ్యాయి. ఆ సమయంలో కారులో నుంచి ఎవ్వరూ బయటకు రాలేకపోయారు. అదే టైంలో అటువైపుగా వస్తున్న ట్రక్కును కారు ఢీకొందని, మంటలు చెలరేగి అందులో ఉన్న వారంతా సజీవదహనం అయ్యారని బరేలీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుశీల్ చంద్ర భాన్ ధులే వెల్లడించారు.
కారులోని ప్రయాణికుంతా వివాహానికి వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన 8 మంది మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన వారు మరణించడంతో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంపై మృతుల బంధువులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.