»Accident In The Candle Factory Pimpri Chinchwad Maharashtra Six People Died
Fire Accident: కొవ్వొత్తుల కర్మాగారంలో ప్రమాదం..ఆరుగురు మృతి
మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని పింప్రి చించ్వాడ్ ప్రాంతంలోని మెరిసే కొవ్వొత్తుల తయారీ యూనిట్లో శుక్రవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా..ఎనిమిది మంది గాయపడ్డారు.
Accident in the candle factory Pimpri Chinchwad maharashtra Six people died
మహారాష్ట్ర(maharashtra)లోని పూణెలోని కొవ్వొత్తుల తయారీ కర్మాగారం(candle factory)లో ఆకస్మాత్తుగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. పూణెలోని పింప్రి చించ్వాడ్( Pimpri Chinchwad) ప్రాంతంలోని తలవాడేలో ఈరోజు మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసు బృందం, అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని పింప్రీ చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శేఖర్ సింగ్ తెలిపారు.
ఈ కర్మాగారంలో మెరిసే కొవ్వొత్తులను ఉత్పత్తి చేస్తున్నారని..వాటిని సాధారణంగా పుట్టినరోజు వేడుకలకు ఉపయోగిస్తారని పోలీసులు తెలిపారు. మృతుల్లోని ఆరుగురిలో ఎక్కువ మంది మహిళలే(womens) ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ఇది కాకుండా గాయపడిన వారందరినీ చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిపుణుల కమిటీ నివేదిక సమర్పించినప్పటికీ ఫైర్ సేఫ్టీ నియమాలు, నిబంధనల అమలుపై మహారాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడంపై హైకోర్టు ఈ వారం ప్రారంభంలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.