»11 Tourists Lost In Waterfall Safe With Rescue Operation
Nellore: జలపాతంలో 11 మంది పర్యాటకులు గల్లంతు..రెస్క్యూ ఆపరేషన్‌తో సేఫ్
జలపాతంలో 11 మంది అయ్యప్పస్వాములు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారం మేరకు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అయ్యప్ప స్వాములను కాపాడారు. 11 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లోని నెల్లూరు జిల్లా (Nellore District)లో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పెంచలకోన జలపాతాన్ని చూసేందుకు వెళ్లి 11 మంది అయ్యప్ప భక్తులు గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో వారు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. జలపాతం వద్ద ఒక్కసారిగా ఉధృతి పెరగడంతో పర్యాటకులంతా కొట్టుకుపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) చేపట్టడంతో పర్యాటకులకు ప్రాణాపాయం తప్పింది. రోప్‌ల సాయంతో పర్యాటకులను సహాయక బృందాలు కాపాడాయి. దీంతో గల్లంతైన వారంతా సురక్షింతగా ఒడ్డుకు చేరారు. పెను ప్రమాదం తప్పడంతో పర్యాటకుల కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో పోలీసులు, ఫైర్ సిబ్బంది స్పందించడం వల్లే పెను ప్రమాదం తప్పిందని పర్యాటకులు అంటున్నారు. తమ ప్రాణాలు కాపాడిన అధికారులను ప్రశంసించారు.
కార్తీకమాసం (Karthika masam) కావడం వల్ల కొంత మంది అయ్యప్పస్వాములు జలపాతం వద్ద విహార యాత్రకు వెళ్లారు. ఆ సమయంలో జలపాతంలోకి దిగగా వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. అలల తాకిడికి వారంతా కొట్టుకుపోయారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది పర్యాటకులను కాపాడారు. దీంతో పర్యాటకులకు ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.