tragedy in telangana elections one employee dies heart attack
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (telangana assembly elections 2023)సమయంలో ఓ చోట విషాదం చోటుచేసుకుంది. ఎన్నికల విధుల్లో భాగంగా ఓ ఉద్యోగి ఉండెపోటుతో మృత్యువాత చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలో చోటుచేసుకుంది. అయితే మృతి చెందిన వ్యక్తి నిసుధాకర్ గా గుర్తించారు. ఈ ఘటన పోలింగ్ బూత్ విధుల్లో ఉండగా బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
సుధాకర్ బుధవారం మధ్యాహ్నం ఎన్నికల విధుల కోసం ఇస్నాపూర్ చేరుకోగా రాత్రి ఈ ఘటన జరిగింది. అతనికి గుండెపోటు(heart attack) వచ్చిన నేపథ్యంలో అప్రమత్తమైన తోటి సిబ్బంది అతనికి సీపీఆర్ చేశారు. అయినప్పటికీ అతను కోలుకోకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. ఈలోపే అతను మరణించడంతో ఎన్నికల అధికారులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే సుధాకర్ సంగారెడ్డి జిల్లా కొండాపూర్ వెటర్నిటీ విభాగంలో సహాయకుడిగా పనిచేస్తున్నాడు. దీంతో సుధాకర్ కుటుంబంలో విషాదం అలుముకుంది.