హైదరాబాద్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హకీంపేటలోని స్పోర్ట్స్ పాఠశాలలో పలువురు విద్యార్థినులపై ఓ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు బయటకొచ్చింది. అయితే దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. దీంతోపాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా రియాక్ట్ అయ్యారు.
బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలికపై లైంగిక వేధింపుల కేసులో సాక్ష్యాలు లభించడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు.
భారత్‌లోని 23 లక్షల అకౌంట్లను ట్విట్టర్ బ్లాక్ చేస్తూ ప్రకటన చేసింది. చిన్నారులపై లైంగిక దాడి, అశ్లీలత, ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న అకౌంట్లను ట్విట్టర్ బ్లాక్ చేస్తూ ప్రకటన చేసింది.
ఈఫిల్ టవర్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సందర్శకులను అనుమతించడం లేదు. బాంబు స్వ్కాడ్‌తో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
హవాయి దీవుల్లో కారుచిచ్చు రగులుకొంది. ఈ ఘటనలో ఇప్పటికే 67 మంది ప్రాణాలు వదిలారు. మంటలకు తోడు బలమైన గాలులు వీస్తుండడంతో పరిస్థితులు చేజారిపోతున్నట్లు అధికారులు వెల్లడించారు. 1946 తరువాత ఇదే అతి పెద్ద అగ్ని ప్రమాదం అని అధికారులు చెబుతున్నారు.
కాపాడాల్సిన పోలీసు అధికారే కామంతో ప్రవర్తించాడు. పుట్టినరోజని ఉందంటూ ఓ యువతిని ఇంటికి పిలిచి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఆపై వీడియోలు కూడా తీసి ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. అయితే యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
నారాయణ కాలేజీలో మరో ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. గతంలో కూడా చాలా మంది చదువుల ఒత్తిడి భరించలేకనో, ర్యాంగింగ్ బారినపడి సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ మాదాపూర్ లోని కాలేజీలో బైపీసీ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
హైదరాబాద్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తండ్రీకొడుకులు కలిసి ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పంజాబ్‌లో పరువు హత్య కలకలం రేపింది. ఓ తండ్రి తన కూతుర్ని చంపి, ఆమె మృతదేహాన్ని బైక్‌కు కట్టి ఈడ్చుకెళ్లాడు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.