తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నారాయణవనం మండలం పోలీస్ స్టేషన్ సమీపంలో స్కూల్ బస్సు ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Road accident on Gorakhpur Kushinagar highway six people dead and 27 injured
Road Accident: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నారాయణవనం మండలం పోలీస్ స్టేషన్ సమీపంలో స్కూల్ బస్సు ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అలాగే.. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కంటైనర్ లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కావలి మండలం చెన్నయ్యపాలెం క్రాస్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మహిళతో పాటు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.