AP Cid Challenges Chandrababu Regular Bail In Supreme Court
Chandrababu: స్కిల్ స్కామ్‌లో జైలు నుంచి ఆరోగ్య సమస్యతో బయటకు వచ్చిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు (Chandrababu) నిన్న ఏపీ హైకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఆరోగ్య సమస్యల దృష్ట్యా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. తిరిగి జైలుకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదని తేల్చిచెప్పింది. దీంతో సీఐడీ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు నాయుడు (Chandrababu) రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహా బ్యారక్‌లో 50 రోజులకు పైగా జ్యుడిషీయల్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. క్యాటరాక్ట్ ఆపరేషన్ కోసం స్పెషల్ బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇటీవల ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరిగింది. ఆ తర్వాత చంద్రబాబుకు గుండెలో రక్త నాళాల మధ్య సమస్య ఉందని ఏఐజీ వైద్యులు రిపోర్ట్ ఇచ్చారని టీడీపీ ప్రకటించింది. దీనిపై వైసీపీ నేతలు కౌంటర్ కూడా ఇచ్చారు.
ఆరోగ్య సమస్యల దృష్ట్యా రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని హైకోర్టును కోరగా.. మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ షరతులు ఈ నెల 28వ తేదీ వరకు వర్తిస్తాయని పేర్కొంది. చంద్రబాబు (Chandrababu) తిరిగి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. దీంతో సీఐడీ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబును జ్యుడిషీయల్ కస్టడీకి ఇవ్వాలని మళ్లీ కోరతారు.