KNR: శంకరపట్నం మండల ఎలక్ట్రిషియన్ వర్కర్స్ యూనియన్ కమిటీ సభ్యులు సీఐటీయూలో చేరారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేశ్ వారిని సంఘంలోకి ఆహ్వానించారు. మండల పరిధిలో 56 మంది ఎలక్ట్రిషియన్లు జీవనం సాగిస్తున్నారని, కార్మిక శాఖ వెల్ఫేర్ బోర్డు కార్డుల నమోదు కోసం ‘మీ సేవ’ కేంద్రాలకు వెళ్తే భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు.