తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శనం 12 గంటల్లోపే పూర్తవుతుందని టీటీడీ తెలిపింది. ప్రస్తుతం 25 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఆదివారం 85,179 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 18,831 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.79 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ వెల్లడించింది.