దేశ రక్షణలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన వీర జవాన్లను సత్కరించేందుకు భారత సైన్యం సిద్ధమైంది. ఈనెల 10న ఢిల్లీలోని మాణిక్షా సెంటర్లో ‘వెస్ట్రన్ కమాండ్ ఇన్వెస్టిచర్ సెర్మనీ-2026’ జరగనుంది. ‘సైన్యం గౌరవం – దేశానికి గర్వం’ అనే నినాదంతో జరిగే ఈ వేడుకను ఉదయం 10:30 గంటల నుంచి తమ కమాండ్ పేరిట ఉన్న యూట్యూబ్ ఛానెల్లో వీక్షించవచ్చని వెస్ట్రన్ కమాండ్ వెల్లడించింది.