E.G: గోకవరం మండలంలో మంగళవారం ఒక్కసారిగా చలిగాలుల తీవ్రత పెరిగింది. పెరుగుతున్న చలికి వృద్ధులు, చిన్నపిల్లలు గజగజ వణుకుతున్నారు. ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తూ ఉపశమనం పొందుతున్నారు. ఈ తీవ్రమైన చలి వల్ల చంటి పిల్లలు జలుబు, దగ్గు, జ్వరాల బారిన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో వచ్చిన ఈ మార్పుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.