NZB: ఉమ్మడి నందిపేట మండలం నేడు బంద్ పాటించాలని నందిపేట బస్ డిపో నిర్మాణ పోరాట సమితి పిలుపునిచ్చింది. 30 ఏళ్ల క్రితం నందిపేటలో బస్ డిపో నిర్మిస్తామని గ్రామస్థులు ఐదెకరాల భూమి కొని ఆర్టీసీకి ఇచ్చారని, అయితే రూ. 10 లక్షలతో గోడ నిర్మించి వదిలేశారని సమితి నాయకులు తెలిపారు. బస్ డిపో నిర్మించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.