VSP: సంక్రాంతి రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ స్టేషన్లో రద్దీ తగ్గించేందుకు జనవరి 7 నుంచి 20 వరకు చర్లపల్లిలో (CHZ) పలు రైళ్లకు తాత్కాలిక హాల్ట్ కల్పించారు. విశాఖ మీదుగా వెళ్లే గరీబ్థ్, విశాఖ ఎక్స్ప్రెస్, గోదావరి ఎక్స్ప్రెస్ రైళ్లు ఇక్కడ ఆగుతాయని వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం పవన్ కుమార్ తెలిపారు. ప్రయాణికులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.