జానపద నృత్య కళాకారిణి వితాబాయి నారాయణగావ్కర్ జీవితం ఆధారంగా బయోపిక్ రాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తుండగా.. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు, మార్చి నాటికి షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.