GNTR: అమరావతి కొత్త లైన్ పనులకు రైల్వే అధికారులు టెండర్లు పిలిచారు. నంబూరు – ఎర్రుపాలెం మార్గంలో, ముఖ్యంగా నంబూరు – కొత్తపల్లి మధ్య విద్యుత్ లైన్ల మార్పు పనులు చేపట్టనున్నారు. వీటి విలువ సుమారు రూ.3 కోట్లు. ఈ పనులను 12 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆసక్తి గల కాంట్రాక్టర్లు జనవరి 23, 2026 లోపు టెండర్లు దాఖలు చేయాలని అధికారులు తెలిపారు.