జపాన్లో తాజాగా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ఆస్తి లేదా ప్రాణ నష్టం సంభవించలేదని అక్కడి అధికారులు తెలిపారు. అలాగే, ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు కూడా లేదని స్పష్టం చేశారు.