HNK: బీజేపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ రాష్ట్ర నాయకులు పగడాల కాళీప్రసాద్ రావు అన్నారు. గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్‌కు చెందిన పలువురు నేతలు కాళీప్రసాద్ రావు సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు తీసుకెళ్లి రాబోయే అన్ని ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.