కర్ణాటకలో సుదీర్ఘకాలం పాలించిన రెండో సీఎంగా సిద్ధరామయ్య రికార్డు సృష్టించారు. మాజీ సీఎం దేవరాజ అరసు (7 ఏళ్ల 239 రోజులు) రికార్డును ఆయన నేటితో సమం చేశారు. రేపటితో ఈ రికార్డును బద్దలు కొట్టనున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. చరిత్రలో సిద్ధరామయ్య పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు.