అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చాలా కాలంగా మాట్లాడలేదని వెనిజులా ప్రతిపక్ష నేత మారియా కొరీనా మచాడో స్పష్టం చేశారు. సోమవారం ఆమె ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. చివరిసారిగా గతేడాది అక్టోబర్ 10న ట్రంప్‌తో మాట్లాడినట్లు తెలిపారు. కాగా, తాను త్వరలోనే తిరిగి స్వదేశానికి చేరుకుంటానని ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మచాడో పేర్కొన్నారు.