HNK: గుడిసెవాసులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు క్రాంతికుమార్ అన్నారు. శాయంపేటలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పెద్దకొడేపాక శివారులో గుడిసెలు వేసుకున్న వారికి ప్రభుత్వం అండగా నిలిచి వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.