మెదక్: నవాబ్ పేటలో నిర్వహించిన శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లన్న స్వామి ఆశీస్సులతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని ఎమ్మెల్యే తెలిపారు.