»The Son Shot His Father For A Government Job Jharkhand Ramgarh
Son shot: ప్రభుత్వ ఉద్యోగం కోసం తండ్రిపై కాల్పులు జరిపించిన కుమారుడు
రోజురోజుకు పలువురు మానవ సంబంధాలను మరుస్తున్నారు. ఈజీ పద్ధతిలో జీవితంలో సెటిల్ కావాలని చూస్తున్నారు. ఆ క్రమంలోనే ఓ యువకుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం తండ్రిపైనే కాల్పులు జరిపించాడు. ఈ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది.
The son shot his father for a government job jharkhand ramgarh
ప్రభుత్వ ఉద్యోగం కోసం తండ్రినే హతమార్చాలనుకున్నాడో యువకుడు. అందుకు కిరాయి హంతకులను కూడా ఏర్పాటు చేశాడు. ఈ ఘటన ఝార్ఖండ్(jharkhand)లో చోటుచేసుకొంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం. రామ్‌జీ అనే వ్యక్తి రామ్‌గఢ్‌లో కుటుంబంతో నివాసముంటున్నారు. సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్(CCL)లో ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం లేని తన 25 ఏళ్ల కుమారుడు అమిత్ ఖాళీగా ఉంటున్నాడు. తండ్రి మరణిస్తే ఆ ఉద్యోగం తనకే వస్తుందని అమిత్ ఆశపడ్డాడు. దీంతో తండ్రినే చంపేందుకు ప్లాన్ వేశాడు. ఆ పనికి కొంతమంది కిరాయి హంతకులను వినియోగించుకున్నాడు. ఈ క్రమంలోనే బయటకు వెళ్లిన రామ్‌జీపై దుండగులు కాల్పులు జరిపారు. పోలీసులు కుటుంబ సభ్యులను విచారించగా కుమారుడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలింది.
కొడుకు పేరు అమిత్ కుమార్ ముండా, తండ్రి పేరు రామ్‌జీ ముండా. నవంబర్ 16న ఆఫీసు నుంచి తిరిగి వస్తున్న రామ్‌జీ ముండాను షూటర్లు అతని ఇంటి ముందు కాల్చిచంపారు. అయితే యాదృచ్ఛికంగా అతను ప్రాణాల నుంచి బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దీనిపై విచారించగా..ఈ ఘటనలో రామ్‌జీ ముండా కుమారుడు అమిత్ కుమార్ ప్రమేయం ఉందని వెలుగులోకి వచ్చింది. ఆ క్రమంలో నిందితుడైన కుమారుడిని పోలీసులు(police) అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బుల్లెట్‌తో గాయపడిన తండ్రి చికిత్స పొందుతున్నాడు.
ఘటనా స్థలంలో ఏడు ఎంఎంషెల్ను కూడా పోలీసులు గుర్తించారు. రామ్‌జీ ముండా పెద్ద కుమారుడు అమిత్ కుమార్ ముండా తన తండ్రి(father) భూమి, ఉద్యోగం(land, job) కోసం తండ్రిని హత్య చేయడానికి కుట్ర పన్నాడు. ఇందుకోసం రూ.4 లక్షల విలువైన నగదును పలువురికి ఇచ్చాడు. ఈ ఘటనలో అమిత్ తన ప్రమేయాన్ని అంగీకరించాడు. కాల్పులు జరిపిన ఇద్దరి గురించి కూడా అమిత్ పోలీసులకు సమాచారం అందించాడు. కాల్పులు జరిపిన ఇద్దరినీ పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విచారణలో తన తండ్రికి ఓ మహిళతో అక్రమ సంబంధం ఉందని అమిత్ పోలీసులకు చెప్పాడు. తండ్రి ఇంటి ఖర్చులు కూడా చెల్లించలేదని…అందుకే కోపంతో తండ్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నాడని కుమారుడు అంటున్నారు.