NZB: ముప్కాల్‌లో పూసల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా ఆవాల శ్రీధర్, ఉపాధ్యక్షుడిగా మర్రి గోవర్ధన్, ప్రధాన కార్యదర్శిగా మర్రి నరేష్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా ఆవాల పోశెట్టి, కార్యదర్శిగా ఆవాల ప్రశాంత్‌లను సభ్యులు ఏకాభిప్రాయంతో ఎంపిక చేశారు. సంఘం బలోపేతానికి, సభ్యుల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు.