IB DSP Died: తిరుమల శ్రీవారి (srivaru) నడకదారిలో విధుల్లో ఉన్న డీఎస్పీ (DSP) అస్వస్థతకు గురయ్యారు. ప్రధాని మోడీ (Modi) పర్యటన కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డీఎస్పీ కృపాకర్ వచ్చారు. తిరుమల నడకదారిలో విధుల్లో ఉన్నారు. అలాగే మెట్ల దారి గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలని అనుకున్నారు. 1805 మెట్టు వద్ద విధుల్లో ఉండగా స్ట్రోక్ వచ్చింది. వెంటనే స్పందించిన సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించారు. అంతలోనే ఆయన చనిపోయారని అధికారులు తెలిపారు. ప్రధాని మోడీ పర్యటన కోసం కృపాకర్ తిరుమల వచ్చారు. ఇంతలోనే ఇలా జరిగింది. కృపాకర్ చనిపోయారని కుటుంబ సభ్యులకు సమచారం ఇచ్చారు. కృపాకర్ స్వస్థలం విజయవాడ సమీపంలో గల పోరంకి అని అధికారులు వివరించారు.