»A 23 Year Old Girl Was Brutally Murdered By Stabbing Her Hundreds Of Times
Viral: వందలసార్లు పొడిచి కిరాతకంగా హత్య.. 23 ఏళ్ల యువతి చేసిన దారుణం
1997 తర్వాత సౌత్ కొరియాలో తొలి మరణశిక్షను కోర్టు విధించింది. అది కూడా 23 ఏళ్ల యువతికి ఆ మరణశిక్షను విధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ కేసు చర్చనీయాంశమైంది.
23 ఏళ్ల యువతి ఓ మహిళను వందలసార్లు పొడిచి హత్య చేసింది. ఆఖరికి ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుముందు హాజరుపరిచారు. ఆమెకు కోర్టు ఉరిశిక్ష వేసింది. ఈ షాకింగ్ ఘటన దక్షిణ కొరియాలో చోటుచేసుకుంది. జంగ్ యూ జంగ్ అనే ఇరవై మూడేళ్ల యువతి ఎక్కువగా క్రైమ్ నవలలు, క్రైమ్ షోలను చూసేది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తన తాతతో ఓ ఇంట్లో ఉంటోంది. తనను అదుపు చేసేవారు లేకపోవడంతో ఎక్కువగా క్రైమ్ స్టోరీలు చదివేందుకు ఇష్టపడేది. అలా ఆమెకు ఎవరినైనా చంపాలనే కోరిక పుట్టింది.
ఓ మహిళను చంపేందుకు ఆ యువతి రీసెర్చ్ కూడా చేసింది. అలా ఓ ట్యూషన్ టీచర్ ఇంటికి విద్యార్థిలా వెళ్లి అటాక్ చేసింది. ఒక్కసారిగా కత్తితో ఆమెను పొడిచింది. ఆ టీచర్ను చంపిన తర్వాత ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా ఆ యువతి నరికి ఓ సూట్ కేసులో దాచిపెట్టింది. ట్యాక్సీ ద్వారా ఆ శరీర భాగాలను నదిలో పడేసేందుకు సిద్ధమైంది. అయితే ఆమె తీరును గమనించిన ట్యాక్సీ డ్రైవర్ పోలీసులకు విషయం చెప్పాడు.
పోలీసులు రంగంలోకి దిగా ఆ యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని గంటల్లోనే ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె ఆ హత్య చేయడానికి కొన్ని నెలల పాటు రీసెర్చ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో జంగ్ తన నేరాన్ని అంగీకరించడంతో కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. 1997 తర్వాత సౌత్ కొరియాలో మరణశిక్ష విధించడం ఇద మొదటిసారి కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ కేసు చర్చనీయాంశమైంది.