»Hyderabad Woman Who Lost Rs 1 59 Crore In A Single Online Transaction
Cybercrime: ఒకే ఆన్లైన్ లావాదేవీలో రూ.1.59 కోట్లు పొగొట్టుకున్న హైదరాబాద్ మహిళ
మీకు అపరిచిత వ్యక్తుల నుంచి కాల్స్ వస్తున్నాయా? అయితే జాగ్రత్త. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు రోజుకో విధంగా పలువురికి కాల్ చేస్తూ దోచేస్తున్నారు. ఇటివల హైదరాబాద్ కు చెందిన ఓ 40 ఏళ్ల మహిళ నుంచి ఏకంగా రూ.1.59 కోట్లు లాగేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
హైదరాబాద్(hyderabad)కు చెందిన ఓ 40 ఏళ్ల మహిళ సైబర్ నేరగాళ్ల(cyber crime) చేతిలో మోసపోయింది. ఓ దుండగుడు చేసిన ఫోన్ కాల్ నిజమని నమ్మి ఏకంగా రూ.1.59 కోట్లు పొగొట్టుకుంది. ఇక వివరాల్లోకి వెళితే ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న 40 ఏళ్ల మహిళ తన భర్త ఇటీవల మరణించడంతో తనకు ఇన్సూరెన్స్, డిపాజిట్లతో సహా రూ.1.59 కోట్లు వచ్చాయి. ఆ క్రమంలోనే ఆగస్టులో కొరియర్ కంపెనీకి చెందిన ఓ వ్యక్తి నుంచి ఆమెకు కాల్ వచ్చింది. ఆమె పేరుతో అక్రమ డ్రగ్స్ ఉన్న పార్శిల్ రవాణా చేయబడిందని ఫోన్లో భయపెట్టారు. ముంబయి నుంచి తైవాన్‌కు పంపుతున్న అక్రమ మాదక ద్రవ్యాలతో కూడిన పార్శిల్‌ను అడ్డగించామని తెలిపారు. అంతేకాదు ఆమె తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆ తర్వాత ఆమె నిర్దోషి అని నిరూపించుకోవడానికి, వారు పంచుకున్న ఖాతాకు రూ. 1.59 కోట్ల ఆర్టిజిఎస్ లావాదేవీ చేయాలని వారు ఆమెకు సూచించారు.
ఆ క్రమంలోనే మోసగాళ్ళు(cyber cheaters) ఆ మహిళను మానసికంగా వేధించారు. స్మగ్లింగ్ కేసులో ముందస్తు అరెస్ట్ బెయిల్ పొందేందుకు ఆమె జీవిత పొదుపు మొత్తాన్ని పంపాలని ఒత్తిడి చేశారు. అయితే ఆ లావాదేవీ మోసపూరితమైనదని బ్యాంక్ చెప్పినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. మోసగాళ్లు చెప్పిందే నిజమని నమ్మి ఆమె ఆ మొత్తం డబ్బును RTGS ద్వారా వారికి ఒకేసారి పంపించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు మోసాపోయానని తెలుసుకున్న బాధితురాలు ఆగస్టు 2023లో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసుల(police)కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు మోసానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కొన్ని రోజుల క్రితం కోర్టు విచారణ తర్వాత బాధితురాలికి రూ. 20 లక్షలు తిరిగి ఇచ్చామని రాచకొండ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.