ఓ కానిస్టేబుల్ తన అత్తమామల విషయంలో కొనసాగుతున్న ఆర్థిక లావాదేవీల విషయంలో కోపుద్రిక్తుడయ్యాడు. ఆ క్రమంలో ఏకంగా తన అత్తపై రివాల్వర్ తో కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృత్యువాత చెందింది.
బీహార్‌లోని బక్సర్‌లోని రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. దీంతో నలుగురు వ్యక్తులు మృతి చెందగా..మరో 50 మంది గాయపడ్డారు.
పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌కోట దాడిలో కీలక సూత్రధారి, భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది షాహిద్ లతీఫ్ హతమయ్యాడు. 2016లో పఠాన్‌కోటపై జరిపిన దాడిలో భారత సైనికులు ఏడుగురు మరణించగా.. ఆరు మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ప్రమాదం అనంతరం ట్యాంకర్ అదుపు తప్పి హైవేపై బోల్తా పడింది. ట్యాంకర్‌లో సోయాబీన్ నూనెతో నింపారు, అది హైవేపై వ్యాపించింది. హైవేపై పోసిన నూనెను దోచుకునేందుకు గ్రామస్తులు, బాటసారుల మధ్య పోటీ నెలకొంది. ట్యాంకర్ బోల్తా పడడంతో హైవేపై చాలాసేపు జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదంలో గొర్రెల మందను తీసుకెళ్తున్న ఇద్దరు గొర్రెల కాపరులకు కూడా గాయాలయ్యాయి.
ఓ పండుగ సందర్భంగా అనేక మంది నదికి స్నానానికి వెళ్లారు. కానీ వారిలో పలువురు తిరిగి రాలేదు. ఆ క్రమంలో గత 24 గంటల్లో 22 మంది మరణించారు. ఈ ఘటన బీహార్‌లోని తొమ్మిది జిల్లాల్లో చోటుచేసుకుంది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఇటివల కాలంలో పోలీసుల అక్రమ దాందాలు, భూ వివాదాల్లో జోక్యం కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే బంజారాహిల్స్(banjara hills)లో పలువురు పోలీసులు భూ దాందాలో జోక్యం చేసుకోవడం, అక్రమ వసూళ్లకు పాల్పడి అరెస్టు కాగా..తాజాగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా ఇద్దరు పోలీసులు భూ వివాదంలో జోక్యం చేసుకుని వేటుకు గురయ్యారు.