Delhi: ఢిల్లీలో చలో నిరసన కార్యక్రమం జరుగుతోంది. దీనిలో భాగంగా ఢిల్లీ శివారులో ఉన్న రైతులపై మరోసారి బాష్పవాయువు ప్రయోగం జరిగింది. రెండోరోజు శంభు సరిహద్దులో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. హరియాణ పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారని తెలిపారు. రైతుల నిరసన నేపథ్యంలో భద్రతను ఇంకా కట్టుదిట్టం చేశారు. కొన్ని మార్గాల్లో వాహన రాకపోకలను కూడా పూర్తిగా నిలిపివేశారు. రైతులను అడ్డుకునేందుకు కాంక్రీటు దిమ్మెలు, ఇనుప కంచెలు, మేకులు, కంటైనర్ల గోడలతో బ్యారికేడ్లను పెట్టారు.
ఇది కూడా చూడండి: Bandla Ganesh: బండ్లకు జైలు శిక్ష.. ఎందుకంటే?
రహదారుల దిగ్బంధంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక చోట్ల కిలోమీటర్ల పొడవున వాహనాలు కూడా నిలిచిపోయాయ. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడంతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని రైతులు చేపట్టిన ఢిల్లీ చలో కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిసిందే. రైతులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. బారికేడ్లను ధ్వంసం చేసుకుని నగరంలోని ప్రవేశించేందుకు పోలీసులు ప్రయత్నించారు.