KMR: ఏర్గట్ల మండలం బట్టాపూర్కు చెందిన ఓ ఇంట్లో ఆదివారం పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారంతో ఆదివారం పోలీస్ సిబ్బందితో కలిసి దాడి చేసినట్లు ఎస్సై పడాల రాజేశ్వర్ తెలిపారు. ఐదుగురు పేకాటరాయుళ్లను పట్టుకుని వారి నుంచి రూ.1,01,280 నగదు, ఐదు సెల్ ఫోన్లు, మూడు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.