Road Accident: దారుణం.. పచ్చని సంసారాన్ని కూల్చేసిన ప్రైవేటు బస్సు
మితిమీరిన వేగం ప్రాణాలను తీస్తోంది. పోలీసులు ఎన్ని ట్రాఫిక్ రూల్స్(Traffic Rules) తీసుకొచ్చిన వాహనదారులలో మాత్రం మార్పు రావడం లేదు. రోజురోజుకూ వాహనాల ప్రమాదాల సంఖ్య ఎక్కువవుతోంది. తాజాగా ఓ ప్రైవేట్ బస్సు(Private Bus) అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ వ్యక్తి ప్రాణాలను(1 Died) కోల్పోయాడు. పుట్టింటి నుంచి తన భార్యను ఇంటికి తీసుకెళ్తున్న ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో మృతదేహం వద్ద భార్య రోదనలు అందర్నీ కలచివేశాయి. ఈ దారుణ ఘటన గోపాలపురం ఠాణా పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల మేరకు..శ్రీసాయి ట్రావెల్స్‌కు చెందిన బస్సు శంషాబాద్ నుంచి మేడ్చల్ కు వెళ్తుండగా ఆదివారం రాత్రి 8.10 గంటలకు వైసీపీ కూడలి వద్ద రెడ్ సిగ్నల్ పడింది. ఆ సమయంలో సిగ్నల్ వద్ద చాలా వాహనాలు ఆగాయి. మేడ్చల్ తిమ్మాపురం వాసి అయిన మహేష్ మితిమీరిన వేగం(High Speed)తో బస్సు నడుపుతూ వచ్చి సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టుకుంటూ కొంత దూరం వరకూ వెళ్లిపోయాడు.
ఈ దారుణ ఘటనలో సింగాయిపల్లికి చెందిన కొత్తపల్లి సందీప్ గౌడ్ బస్సు కింద పడి అక్కడికక్కడే మృతి(Died) చెందాడు. బైక్ పై ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ఇద్దరిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వినయ్ అనే వ్యక్తిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు(Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ మహేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని డ్రైవర్ చెబుతున్నాడు.
ప్రమాదం(Road Accidents)లో మృతిచెందిన సందీప్ గౌడ్ కు ఏడాది క్రితమే పెళ్లి అయ్యింది. ఆదివారం సాయంత్రం తన భార్యను ఇంటికి తీసుకుని వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. భార్య కళ్లెదుటే భర్త ప్రాణాలు(Husband Died) కోల్పోయాడు. భర్త మృతదేహం వద్ద ఆమె విలపించిన తీరు అందరికీ కంటతడి తెప్పించింది. బస్సు డ్రైవర్(Bus Driver)ను అక్కడున్నవారంతా చితకబాదారు.