• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన జెన్కో డీఈ

BHPL: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని మంజూరునగర్‌లో గల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం నుంచే భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జెన్కో డీఈ రామకృష్ణరెడ్డి- మనోజ దంపతులు స్వామి వారికీ పట్టువస్త్రాలు సమర్పించారు.

March 19, 2026 / 05:26 PM IST

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి అధునాతన పరికరాలు

HYD: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి BHEL యూనిట్ ఆధ్వర్యంలో అధునాతన పరికరాలు అందించినట్లు తెలిపారు. అడ్వాన్స్ ప్లాస్టిక్ అండ్ రీ కన్ స్ట్రక్షన్ సపోర్టివ్ పరికరాలు అందించి, వాటిని టెస్టింగ్ చేశారు. CSR ఇనిషియేటివ్ ప్రోగ్రాంలో భాగంగా అందించామని, ప్రజలకు మరింత వైద్య సేవలు అందడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.

March 19, 2026 / 05:23 PM IST

పెద్ద లింగాపూర్‌లో పంచాంగ శ్రవణం

SRCL: ఉగాది సందర్భంగా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌లో గురువారం పంచాంగ శ్రవణాన్ని అనిపించారు. ఈ సందర్భంగా పెద్ద లింగాపూర్ సర్పంచ్ గన్నేరం వసంత మాట్లాడుతూ.. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని అని కోరుకున్నారు. అందరికీ నూతన ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రమేష్, వార్డు సభ్యులు విజయ, శ్రీనివాస్ పాల్గొన్నారు.

March 19, 2026 / 05:21 PM IST

ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ దంపతులు

KMM: ఉగాది పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి జూబ్లీహిల్స్ లోని శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ దంపతులు తమ గోత్ర నామంతో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతంరం వారికి వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.

March 19, 2026 / 05:20 PM IST

‘కాంగ్రెస్ పాలనలోనే మహిళల పురోభివృద్ధి’

KNR: కాంగ్రెస్ పాలనలోనే మహిళలు ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తారని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కప్పంపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామంలో వీవో భవన నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

March 19, 2026 / 05:18 PM IST

శేరిలింగంపల్లిలో ఘనంగా రంజాన్ తోఫా పంపిణీ

RR: శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో పాపిరెడ్డి కాలనీ మసీదులో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సర్వమత సౌభాతృత్వానికి, సమానత్వానికి నిదర్శనమని కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

March 19, 2026 / 05:17 PM IST

అబ్దుల్లాపూర్ సీసీ రోడ్లకు రూ.8 లక్షల నిధులు

NRML: లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.8 లక్షల నిధులు మంజూరైనట్లు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన నిధుల ప్రోసిడింగ్ కాపీని గ్రామస్థులలకు అందజేశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

March 19, 2026 / 05:14 PM IST

హుస్సేన్ నాయక్‌ను పరామర్శించిన ఎమ్మెల్సీ

MHBD: గూడూరు మండలంలోని మాచర్ల గ్రామానికి చెందిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ తండ్రి జాటోత్ లచ్చా నాయక్ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు గురువారం వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం హుస్సేన్ నాయక్‌ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

March 19, 2026 / 05:10 PM IST

‘ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం’

RR: కొందుర్గు మండలం తంగెళ్లపల్లి గ్రామంలో రెండవ వార్డ్‌లో రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి CC రోడ్డు పనులను సర్పంచ్ చందన గోవర్ధన్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. నియోజకవర్గంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.

March 19, 2026 / 05:02 PM IST

బాచుపల్లిలో క్షయవ్యాధి పరీక్షలు షురూ..!

MDCL: స్పెషల్ డ్రైవ్ కింద బాచుపల్లి TB యూనిట్ కేంద్రంలో క్షయ వ్యాధి పరీక్షలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అసోసియేట్ ప్రొఫెసర్ ఎండి డాక్టర్ రాజీవ్ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు ప్రారంభించగా, మమత మెడికల్ సైన్స్ కాలేజీలో సైతం నిర్వహించినట్లు తెలిపారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా వ్యాప్తంగా జీరో కేస్ TB లక్ష్యంగా పరీక్షలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

March 19, 2026 / 05:02 PM IST

దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత: నిర్మలా రెడ్డి

SRD: ఆలయాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మలా రెడ్డి పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డిలోని సాయిబాబా ఆలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.

March 19, 2026 / 05:01 PM IST

పలుగుగడ్డలో ఘనంగా ఉగాది వేడుకలు

SDPT: జగదేవ్‌పూర్ మండలంలోని పలుగుగడ్డ గ్రామంలో పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. గ్రామ సర్పంచ్ కనుకయ్య ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పండితులు గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సర రాశిఫలాలు, ఆదాయ-వ్యయ సూచనలు, గ్రహగతులను వివరించారు. 

March 19, 2026 / 05:01 PM IST

నూతన పార్టీ కార్యాలయం ప్రారంభం..!

GDWL: అయిజ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని గురువారం కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మద్దిలేటి, జిల్లా అధికార ప్రతినిధి మైనర్ బాబు, వార్డు ఇంఛార్జ్ మాల గాయత్రి తదితరులు పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యకర్తలు ఉత్సాహంగా తరలివచ్చి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

March 19, 2026 / 05:01 PM IST

బీజేపీ బలాన్ని రెట్టింపు చేస్తాం: BJP చీఫ్

HYD: ఉగాది నూతన సంవత్సరం వేళ రాష్ట్ర ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది నూతన సంవత్సర వేడుకల్లో పార్టీ కార్యాలయంలో పాల్గొన్న ఆయన, ఈ నూతన సంవత్సరం బీజేపీ బలాన్ని రెట్టింపు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా మల్కాజ్‌గిరి ప్రజలను ఉద్దేశించి, రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు.

March 19, 2026 / 05:00 PM IST

చౌటుప్పల్‌లో చలివేంద్రం ప్రారంభం

BHNG: చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవా ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. చింతల వెంకట్ రెడ్డి జ్ఞాపకార్ధంగా వారి కుమారుడు చింతల ప్రభాకర్ రెడ్డి శ్వేత సౌజన్యంతో చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ నందు చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ మన్మధ కుమార్ హాజరయ్యారు.

March 19, 2026 / 04:56 PM IST