• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

వేద పండితులు, అర్చకులను సన్మానించిన ప్రభుత్వ విప్

SRCL: ఉగాది పండుగను పురస్కరించుకుని దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ పుణ్యక్షేత్రంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్నందున, భీమేశ్వరాలయంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వవిప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేద పండితులు, అర్చకులను ఘనంగా సత్కరించారు.

March 19, 2026 / 06:25 PM IST

గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి: ఎస్పీ

ADB: నేరాల నియంత్రణకు గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని SP అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీలను గ్రామస్థులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గంజాయికి దూరంగా, రోడ్డు భద్రత, మహిళల భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు పాటించిన గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.

March 19, 2026 / 06:20 PM IST

దివ్యాంగుల సమస్యలపై పోరాటం చేస్తా: ఎంపీ

HNK: మానసిక దివ్యాంగుల సమస్యలపై పార్లమెంటులో పోరాటం చేస్తానని ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని మల్లికాంబ మనో వికాస కేంద్రంలో ఉగాది పండుగ వేడుకల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ఎంపీ పాల్గొన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దివ్యాంగుల భద్రత, సంక్షేమానికి ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ఎంపీ కోరారు.

March 19, 2026 / 06:20 PM IST

ఆకట్టుకున్న చిన్నారుల ప్రత్యేక అలంకరణ

SRCL: ఉగాది పండుగ సందర్భంగా ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో చిన్నారులకు ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ ఆనవాయితీ ఏళ్ల తరబడి కొనసాగుతోంది. పండుగ రోజున చిన్న పిల్లలకు పెద్దలు కొత్త బట్టలు ధరింపజేసి వారి మెడలో కుడుకలు, బిస్కట్లు, పల్లి దండలు, డ్రై ఫ్రూట్స్ బహుమతుల హారాలను వేస్తూ ఆశీర్వచనాలు అందజేస్తున్నారు.

March 19, 2026 / 06:20 PM IST

మాజీ మంత్రిని కలిసిన BRS పార్టీ నేతలు

WNP: మాజీ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీరంగాపురం మండల BRS పార్టీ నేతలు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆ దేవుని ఆకాంక్షిస్తున్నానట్లు చెప్పుకొచ్చారు.

March 19, 2026 / 06:15 PM IST

రాజీవ్ గృహకల్పలో ఘనంగా ఉగాది వేడుకలు

RR: శేరిలింగంపల్లి రాజీవ్ గృహకల్పలోని సాయిబాబా ఆలయ అభివృద్ధిలో భాగంగా మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ నూతన బోర్ వెల్‌ను ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణంలో పాల్గొని నూతన సంవత్సర ఫలితాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

March 19, 2026 / 06:15 PM IST

ఓదెల మల్లన్న ఆలయంలో 40 ఏళ్ల భక్తి సంప్రదాయం

PDPL: భక్తికి రూపం ఉంటే అది ఓదెల మల్లన్న క్షేత్రంలో కనిపిస్తుంది. ఉగాది పర్వదినం వేళ పెద్దపల్లి జిల్లా ఓదెల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా హరిపురం గ్రామ యాదవ కులస్తులు తమ 40 ఏళ్ల నాటి అరుదైన సంప్రదాయాన్ని చాటుకున్నారు. ప్రత్యేకంగా అలంకరించిన మేకపోతుల రథంతో భక్తులు ఊరేగింపుగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

March 19, 2026 / 06:10 PM IST

రేపటి నుంచి కోట మైసమ్మ బ్రహ్మోత్సవాలు

KMM: ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి గ్రామంలో గల శ్రీ కోట మైసమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు పవిత్ర బ్రహ్మోత్సవాల జరగునున్నాయి. ఈ మేరకు ఆలయ ఛైర్మన్ డాక్టర్ పర్స పట్టాభి రామారావు, ఈవో కె వేణుగోపాల చార్యులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

March 19, 2026 / 06:10 PM IST

‘రేపటి బీజేపీ ధర్నాను విజయవంతం చేయాలి’

MNCL: రాష్ట్ర BJP ఆదేశాల మేరకు ఈనెల 20న ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్ ముందు చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలని కోరుతూ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు. కావున జిల్లా, మండల నాయకులందరూ ఈ ధర్నా కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.

March 19, 2026 / 06:08 PM IST

ఘనంగా ఉగాది పర్వదిన వేడుకలు…

SRD: చిన్నకోడూరు మండలంలోని ఆయా గ్రామాల్లో ఉగాది పర్వదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని, భక్షాలను తయారు చేసి ఆరగించారు. కాగా, ఆయా గ్రామాల్లో పండితులు నూతన సంవత్సర పంచాగాన్ని ప్రజలకు వినిపించారు.

March 19, 2026 / 06:07 PM IST

కొండచిలువ దాడిలో గొర్రె మృతి

SDPT: అక్కన్నపేట మండలంలోని కపూర్ నాయక్ తండా పంచాయతీ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. నందారం స్టేజి సమీపంలో గొర్రెలను మేపుతుండగా, ఒక గొర్రె అదృశ్యమైంది. యజమాని వెంకటేశ్ పొదల్లో వెతకగా, భారీ కొండచిలువ గొర్రెను చుట్టేసి చంపేసిన దృశ్యం కనిపించింది. ఈ ఘటనతో స్థానిక గొర్రెల కాపరులు, రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

March 19, 2026 / 06:07 PM IST

కేటీఆర్‌ని కలిసిన MLA

MBNR: ఉగాది పండుగను పురస్కరించుకుని ఇవాళ HYD తెలంగాణ భవన్లో నిర్వహించిన ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమానికి జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి గురువారం హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు ఆయన ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ఈ సంవత్సరం పోరాడి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు.

March 19, 2026 / 06:05 PM IST

రూ.40 వేల విలువైన బెంచీల విరాళం..!

NRPT: నర్వ మండలం యాంకి గ్రామానికి చెందిన వెంకటేష్, తిరుపతయ్య తమ తల్లిదండ్రులు కీ.శే.చెన్నమ్మ, హన్మంతు జ్ఞాపకార్థం జక్కన్నపల్లి గ్రామానికి దాదాపు రూ.40 వేల విలువైన బెంచీలను ఇవాళ విరాళంగా అందజేశారు. జక్కన్నపల్లి సర్పంచ్ అనిత వినతికి స్పందించి ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ సేవా కార్యక్రమాలు సమాజ అభివృద్ధికి దోహదపడతాయని వారు అభిప్రాయపడ్డారు.

March 19, 2026 / 06:02 PM IST

కాలిపోయిన ట్రాన్స్ ఫార్మర్.. చర్యలు శూన్యం

NLG: తిరుమలగిరి సాగర్(మం) బోగ్యతండాలో ట్రాన్స్ ఫార్మర్ కాలిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. గ్రామంలో ట్రాన్స్ ఫార్మర్ లేకపోవడంతో కరెంట్ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. మంచి నీటి సరఫరా అంతంత మాత్రమే అని, కరెంట్ సమస్య వల్ల సరఫరా మరింత తగ్గి నీటి కోసం అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

March 19, 2026 / 05:57 PM IST

కామారెడ్డిగూడెంలో ఉగాది వేడుకలు

JN: దేవరుప్పుల మండలంలోని కామారెడ్డి గూడెంలో ఉగాది పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చింత రవి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉగాది పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని సర్పంచ్ రవి ఆకాంక్షించారు.

March 19, 2026 / 05:55 PM IST