PDPL: తెలంగాణ ప్రభుత్వ విప్‌గా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నుండే ప్రభుత్వ విప్‌గా నియమితులయ్యే సమాచారంతో సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అయింది. అనుకున్నట్టుగానే ప్రభుత్వం ఆయనను విప్‌గా నియమించింది. తనకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.
MBNR: గండీడ్ మండలంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి శుక్రవారం విస్తృతంగా పర్యటించనున్నారు. పర్యటన వివరాలు.. మధ్యాహ్నం 3 గంటలకు రైతు వేదికలో కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేయనున్నారు. అనంతరం జెడ్పీ హైస్కూల్‌లో కొత్త గదులు, సైన్స్ ల్యాబ్ ప్రారంభిస్తారు. అలాగే స్థానిక సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు కాంగ్రెస్ట్ నాయకులు తెలిపారు.
GDWL: గద్వాల మండలం పరుమాల గ్రామానికి చెందిన జమ్మన్న కుమార్తె గురువారం ప్రమాదవశాత్తు వేడి నీళ్ల హీటర్‌లో పడి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ చిన్నారికి చర్మం పూర్తిగా కాలిపోవడంతో పాటు శ్వాస తీసుకోవడం కష్టతరంగా మారింది. దీంతో డాక్టర్లు మెరుగైన చికిత్స కోసం అత్యవసరంగా హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు.
ఖమ్మం DCC నూతన కార్యవర్గాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కసరత్తు చేసిన పీసీసీ జిల్లాలోని కీలక నేతలందరికీ ప్రాధాన్యత ఇస్తూ సమతుల్యమైన కమిటీని వెల్లడించింది. ఈ నూతన కార్యవర్గంలో 11 మంది ఉపాధ్యక్షులు, 22 మంది ప్రధాన కార్యదర్శులు, 26 మంది కార్యదర్శులకు చోటు కల్పించారు.
WNP: గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి పాల్గొన్నారు. కొత్త ఆశలతో, కొత్త ఆశయాలతో తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలతో, రైతన్నల ఇంట పాడిపంటలతో, అభివృద్ధి పథంలో రాష్ట్రం ముందుండాలని కోరుకున్నట్లు తెలిపారు.
HYDలో జీహెచ్ఎంసీ వ్యాప్తంగా శానిటేషన్ సంబంధించి కమిషనర్ కర్ణన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల లోపు ప్రధాన రహదారులు మొత్తం క్లీన్ చేయాలని, 10 గంటల తర్వాత శానిటేషన్ పనులు రోడ్లపై కనిపించోదని పేర్కొన్నారు. పకడ్బందీగా అమలు చేయడం కోసం డిప్యూటీ కమిషనర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారులకు ప్రత్యేక విధులు నిర్వర్తించాలని అన్నారు.
NLG: హాలియా వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్లు గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడుతున్నాయి. అనుముల, పెద్దవూర, తిరుమలగిరి సాగర్ మండలాల్లో ఈ డ్యామ్ల వల్ల నీరు నిల్వ ఉండి భూమిలోకి చొరబడుతోంది. దీంతో నాన్ ఆయకట్టు ప్రాంతాల్లోని బోరు బావుల నీటి మట్టం పెరిగింది. సాగు నీటి సమస్యలు తగ్గడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
KNR: కరీంనగర్ రూరల్ మండలం నగునూరులోని సిల్వర్ స్ప్రింగ్ విల్లాల్లో విద్యుత్ వైర్ల దొంగతనానికి పాల్పడ్డ నలుగురు నిందితులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 60 వేల విలువైన వైర్ బండళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వీరు జల్సాల అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
ADB: గాదిగూడ మండలంలోని అర్జుని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మెస్రం శేఖర్ బాబు గురువారం 23వ సారి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముత్నూరుకు చెందిన ఓ బాలింతకు బీ-పాజిటివ్ రక్తం అవసరం ఉందని ITDA హెల్ప్ డెస్క్ సూచించిందన్నారు. అయితే.. మానవ సేవయే మాధవ సేవ అనే ఆలోచనతో ఇప్పటి వరకు 23 సార్లు తన రక్తాన్ని దానం చేశామన్నారు.
BHPL: మల్హర్(M) కొయ్యూరు మసీదులో ముస్లిం సోదర, సోదరీమణులకు రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. రంజాన్ పండుగను మండల వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం సమాన ప్రాధాన్యతను కల్పిస్తుందని ప్రకాష్ రెడ్డి అన్నారు.
NZB: కోటగిరిలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏటా నిర్వహించే కుస్తీ పోటీలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో ఆ రాష్ట్రం నుంచి మల్లయోధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ప్రతాపాన్ని ప్రదర్శించారు. ఈ వేడుకల్లో గ్రామ పెద్ద గంగాధర్ దేశాయ్, సర్పంచ్ బర్ల మధుకర్ పాల్గొన్నారు.
MDK: తూప్రాన్ పట్టణంలోని బ్రాహ్మణపల్లి వార్డులో ఉగాది పర్వదినం సందర్భంగా వాటర్ ప్లాంట్‌ను ఛైర్ పర్సన్ బొంది రజని రాఘవేందర్ గౌడ్ ప్రారంభించారు. ఎన్నికల సమయంలో చెడిపోయిన ప్లాంట్‌ను పునరుద్ధరించనున్న హామీ మేరకు ఈ చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మునిరాతి లక్ష్మీ మల్లేష్, పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
JN: హైదరాబాదులో ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులను రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి కలిసి రైతు ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానం అందజేశారు. అనంతరం రైతు ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు, ఇతర అంశాలపై కాసేపు వారితో రాఘవరెడ్డి క్షుణ్ణంగా చర్చించారు.
BHNG: గుండాల(మం) అంబాల గ్రామం హనుమాన్ దేవాలయంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సర్పంచ్ జక్కుల రాణమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు నూతన సంవత్సర ఫలితాలను భక్తులకు వివరించారు. దశాబ్దాలుగా వస్తున్న ఈ ఆచారంలో గ్రామస్థులంతా ఏకమై పాల్గొనడం విశేషం. గ్రామం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు.
SRPT: మునగాల(మం) బరఖత్ గూడెంలోని వెంకటేశ్వర ఆలయంలో కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుడి చారిత్రాత్మకమైందని, ఉగాది సందర్భంగా లక్ష పుష్పార్చన పూజా నిర్వహించడం తమకు దక్కిన భాగ్యమని చెప్పుకొచ్చారు.