• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పవర్ హౌస్ కాలనీలో విష సర్పం కలకలం

PDPL: పవర్ హౌస్ కాలనీలోని సింగరేణి క్వార్టర్స్‌లో గురువారం విష సర్పం కలకలం సృష్టించింది. సత్యనారాయణ ఇంట్లోకి పాము రావడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో అడ్డగుంటపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ అబ్బాస్ అక్కడికి చేరుకుని, ఆ పామును చాకచక్యంగా పట్టుకుని సంచిలో బంధించారు. దానిని నిర్మానుష్య ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.

March 20, 2026 / 05:57 AM IST

నేషనల్ టీమ్ చెస్ ఛాంపియన్ షిప్ కోచ్‌గా అరుణ్ కుమార్

NRML: ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న 45వ నేషనల్ టీమ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలానికి చెందిన గాడి అరుణ్ కుమార్ కోచ్‌గా ఎంపికయ్యారు. భారత త్రివిధ దళాలకు ప్రాతినిధ్యం వహించే SSCB జట్టుకు ఆయన నేతృత్వం వహించడం విశేషం. ఈ నెల 16 నుంచి 22 వరకు జరిగే ఈ టోర్నీలో అరుణ్ కుమార్ తన జట్టును విజయపథంలో నడిపించాలని జిల్లా వాసులు కోరారు.

March 20, 2026 / 05:42 AM IST

బ్రాహ్మణ వెల్లంల ఆలయంలో పంచాంగ శ్రవణం

NLG: నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం సాయంత్రం పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయం అర్చకులు మరింగంటి లక్ష్మీ నరసింహ చార్యులు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వివిధ రాశుల వారి బలాలు, వర్షాలు, వ్యవసాయం, ప్రభుత్వ పరిపాలన, రాజకీయ పార్టీల బలాలు, తదితర విషయాల గురించి తెలియజేశారు.

March 20, 2026 / 05:32 AM IST

కామారెడ్డిలో కాళ్ల గణేష్‌కు కీలక పదవి

కామారెడ్డి 41వ వార్డు మాజీ కౌన్సిలర్ కాళ్ల గణేష్‌ను TPCC జనరల్ సెక్రటరీగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. 41వ వార్డులో గణేష్, ఆయన సతీమణి రాజమణి వరుసగా మూడు సార్లు కౌన్సిలర్లుగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు CM రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్‌లకు కృతజ్ఞతలు తెలపారు

March 20, 2026 / 05:30 AM IST

ఉగాది పంచాంగ శ్రవణంలో పాల్గొన్న ఎమ్మెల్యే

WNP: ఉగాది పంచాంగ శ్రవణం సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు, మున్సిపల్ ఛైర్మన్ శ్రీమతి SLN మాధవి రమేష్, జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు వాకిటి ఆదిత్యతో కలిసి వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరికీ ఐశ్వర్యం కలగాలని ఆకాక్షించారు.

March 20, 2026 / 05:29 AM IST

రాంపూర్‌లో రంజాన్ తోఫాల పంపిణీ

NRPT: నర్వ మండలం రాంపూర్‌లో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఉపసర్పంచ్ ఎండీ రఫీక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ నాగన్నగారి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని తోఫాలను అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ తోఫాలు రంజాన్ పర్వదినంలో ముస్లిం సోదరులకు ఉపయోగపడతాయని నాయకులు తెలిపారు.

March 20, 2026 / 05:28 AM IST

కురుమూర్తి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

MBNR: శ్రీ పరాభవ నామ సంవత్సర ప్రారంభం సందర్భంగా కురుమూర్తి స్వామి సన్నిధిలో నిర్వహించిన పంచాంగ శ్రవణానికి ఎమ్మెల్యే జీ.మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పరాభవ నామ సంవత్సరం అందరికీ శుభప్రదం కావాలని ఆకాంక్షించారు.

March 20, 2026 / 05:25 AM IST

ఇద్దరిపై సస్పెన్షన్ ఎత్తివేత

NZB: 10వ తరగతి పరీక్షల్లో భాగంగా నిన్న బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రశ్నా పత్రం లీక్ ఘటనకు సంబంధించి విచారణ పూర్తి అయ్యిందని DEO అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. విచారణలో లీక్ అవాస్తవమని తేలిందన్నారు. ఈ మేరకు సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్ కె.వేణు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ ఏ. శివానంద్ రావుపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసినట్లు DEO తెలిపారు

March 20, 2026 / 05:24 AM IST

పేలుడు పదార్థాలను తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్

ASF: ఎటువంటి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను తరలిస్తున్న ముగ్గురిని జైనూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన కిషన్ లాల్, అజయ్ పాల్, ఆశిష్ జైస్వాల్‌గా సీఐ రమేష్ గుర్తించారు. బావుల్లో రాళ్లను పేల్చేందుకు వీటిని తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు నిందితుల వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు

March 20, 2026 / 05:10 AM IST

నేడు గద్దలపల్లి పీహెచ్‌సీలో మెగా మెడికల్ క్యాంప్

PDPL: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇవాళ మంథని మండలంలోని గద్దలపల్లి (బిట్టుపల్లి) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు వైద్యాధికారి డాక్టర్ సీహెచ్ మాధురి తెలిపారు. శిబిరంలో స్త్రీల, కంటి, దంత, ఎముకల, పిల్లల వైద్య నిపుణులతోపాటు జనరల్ ఫిజీషియన్లు సేవలు అందించనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 20, 2026 / 05:08 AM IST

ముస్లింలకు దుస్తులు పంపిణీ

KNR: సైదాపూర్ మండలంలోని ఏక్లాస్పూర్ గ్రామంలో ముస్లింలకు గ్రామ సర్పంచ్ బాసరాజు రజిత గురువారం దుస్తులు, కానుకలతోపాటు ఈద్ కా తోఫాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లింల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

March 20, 2026 / 04:44 AM IST

విద్యార్థిని అభినందించిన కేంద్రమంత్రి బండి

KNR: జవహర్ నవోదయ విద్యాలయం ఎంట్రన్స్ పరీక్షలో సీటు సాధించిన చొప్పదండికి చెందిన పురెళ్ల సహస్రను కేంద్రమంత్రి బండి సంజయ్ అభినందించారు. గురువారం తమ నివాసంలో కలిసిన సహస్రకు వారు శుభాకాంక్షలు తెలిపారు. నిర్థిష్ట లక్ష్యం, క్రమశిక్షణతో చదువుతూ భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశీస్సులు అందచేశారు. ఇందులో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

March 20, 2026 / 04:35 AM IST

పొన్కల్ బ్రహ్మోత్సవాలకు ఘన ఏర్పాట్లు

NRML: మామడ మండలం పొన్కల్ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈనెల 29 నుంచి వచ్చే నెల 3 వరకు నిర్వహించనున్న ఉత్సవాలకు సంబంధించి గోడ పత్రికలను ఆవిష్కరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు చిట్యాల రాజారెడ్డి కోరారు. సమావేశంలో భక్తులకు కల్పించే సౌకర్యాలపై చర్చించారు.

March 20, 2026 / 04:29 AM IST

అహల్యాబాయి విగ్రహానికి భూమి పూజ

ADB: బేల మండలం సిర్సన్న గ్రామంలో అహల్యాబాయి హోల్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు అడుగు పడింది. జై మల్హర్ యూత్ ఆధ్వర్యంలో గ్రామస్తుల సమక్షంలో భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. యువత చొరవతో చేపట్టిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సమాజానికి స్ఫూర్తినిచ్చేలా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

March 20, 2026 / 04:07 AM IST

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రభుత్వ విప్ అది

SRCL: వేములవాడలో రంజాన్ మాసం సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇఫ్తార్ విందుకు ముందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముస్లింలతో కలిసి ఉపవాస విరమణ చేయించినారు.

March 20, 2026 / 04:05 AM IST