KMM: ప్రజలకు పరిశుభ్రతపై మధిర ఛైర్‌పర్సన్ సామినేని సుజాత అవగాహన కల్పించారు. మధిర మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో శుక్రవారం పారిశుద్ధ్య పనులను ఇవాళ ప్రారంభించారు. వార్డు కౌన్సిలర్ ఎర్రం దాసు చారులత ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. కమిషనర్ సంపత్ కుమార్ పర్యవేక్షణలో కాలువల శుభ్రత, చెత్త తొలగింపు పనులు ముమ్మరంగా సాగాయి.
PDPL: పెద్దపల్లి DCC ఉపాధ్యక్షుడిగా ముత్తారం మండలం కేసనపల్లికి చెందిన చొప్పరి సదానందం నియమితులయ్యారు. ఈ మేరకు TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా సదానందం గతంలో సైతం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. రెండవసారి తిరిగి ఉపాధ్యక్షులుగా నియమితులు కావడంతో పార్టీ నాయకులు, శ్రేయోభిలాషులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
WGL: రైతులు మక్కజొన్నలను దళారులకు అమ్మి మోసపోవద్దని కలెక్టర్ సత్య శారద సూచించారు. నర్సంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో మార్క్‌ఫెడ్ మక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ ఛైర్మన్ శ్రీనివాస్‌తో కలిసి ఆమె ఇవాళ ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 8 మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
KMR: దోమకొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో నూతన భవనం మంజూరు చేయాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని సర్పంచ్ ఐరేనీ నర్సయ్య శుక్రవారం కోరారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి భవనం మంజూరుకు కృషి చేస్తానని షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు.
VKB: ధారూర్ మండలం పన్ను వసూళ్లలో అరుదైన ఘనత సాధించింది. మండల యంత్రాంగం, ప్రజా ప్రతినిధుల కృషితో 34 గ్రామ పంచాయతీల్లో 100 శాతం పన్ను వసూళ్లు పూర్తయ్యాయని MPO సఫీ ఉల్లా ఖాన్ వెల్లడించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శిలను అభినందించారు. గ్రామాలు అభివృద్ధి బాటలో దూసుకుపోతున్నాయని తెలిపారు.
ADB: జనగణన ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలనీ జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక టీటీడీసీలో సెన్సస్-2027 పై నిర్వహించిన శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సెన్సస్ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్నామని అన్నారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.
KNR: గంగాధర మండలం కూరిక్యాల సొసైటీ కార్యాలయంలో రైతు భరోసా దరఖాస్తులను స్వీకరిస్తునట్లు కురిక్యాల క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి వెంకట్ స్వామి తెలిపారు. రైతులు భూమి పట్టా పాసుబుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా బుక్ జిరాక్సులను సొసైటీ కార్యాలయంలో అందజేయాలని ఆయన సూచించారు. అన్నదాతలకు దీనిపై ఏమైనా సందేహాలు ఉంటే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని కోరారు.
NRML: తానూర్ మండలంలోని హిప్నెల్లి గ్రామంలో పాఠశాల అభివృద్ధి పనులకు సర్పంచ్ గంగ సాగర – శివరాం శ్రీకారం చుట్టారు. సుమారు 27 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పాఠశాల భవన మరమ్మతులు, అదనపు వసతుల కల్పన కోసం ఈ నిధులను వెచ్చించనున్నారు. విద్యార్థులకు మెరుగైన వాతావరణంలో విద్యను అందించడమే తమ లక్ష్యమని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాల్గొన్నారు.
ADB: ప్రభుత్వం అందజేస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం పట్టణంలోని శాంతినగర్‌లో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా DMHO నరేందర్ రాథోడ్ ఆధ్వర్యంలో వైద్య బృందం సభ్యులు రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు.
NLG: చిట్యాల మండలం వెలిమినేడులో రాచకాలువ మురికి కూపంగా మారి ప్రజలను వేధిస్తోంది. ఎన్నికల ముందు పాలకులు హామీలు ఇచ్చినా, అమలులో నిర్లక్ష్యం వహించడంతో కాలువ అంతా చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్ధాలు, గుర్రపుడెక్కతో నిండిపోయింది. దీనివల్ల వస్తున్న దుర్గంధం, దోమల వ్యాప్తితో స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. కాలువను ఆధునీకరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
JGL: ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న వ్యవసాయ పనిముట్లను మల్లాపూర్ మండలం రాఘవపేటలో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు రైతులకు అందజేశారు. గ్రామానికి చెందిన హరీష్‌కు రోటవేటర్, భూమయ్యకు ప్లవ్‌ను పంపిణీ చేశారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సబ్సిడీ ఉపకరణాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డికి, కోరుట్ల కాంగ్రెస్ ఇంఛార్జ్ నర్సింగరావుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
JGL: ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న వ్యవసాయ పనిముట్లను మల్లాపూర్ మండలం రాఘవపేటలో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు రైతులకు అందజేశారు. గ్రామానికి చెందిన హరీష్‌కు రోటవేటర్, భూమయ్యకు ప్లవ్‌ను పంపిణీ చేశారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సబ్సిడీ ఉపకరణాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డికి, కోరుట్ల కాంగ్రెస్ ఇంఛార్జ్ నర్సింగరావుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
MDK: కేజీబీవీ విద్యార్థులకు మెనూను తప్పక అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులకు సూచించారు. టేక్మల్ మండల కేంద్రంలో కేజీవీబీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీవీబీ పాఠశాలలో స్టోర్ రూమును, కిచెన్, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కేజీవీబీ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెనూ తప్పక అమలు చేయాలన్నారు.
MNCL: 46 ఏళ్ల కళామతల్లి సేవకు గుర్తింపుగా ప్రజా కళాకారుడు బెల్లంపల్లికి చెందిన సబ్బని కృష్ణకు బహుజన సాహిత్య అకాడమీ తిరుపతిలో శుక్రవారం కళారత్న నేషనల్ అవార్డును అందజేసింది. సబ్బని కృష్ణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులుగా, రచయితగా, గాయకుడిగా, దర్శకునిగా పనిచేశారు. అయనకు అవార్డు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
BHNG: శాసనమండలి, శాసనసభలో కొత్తగా నియమితులైన ప్రభుత్వ విప్‌లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ విప్‌లుగా నియమితులైన ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్ నర్సింగరావు, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, విజయ రమణారావులకు స్వాగతం పలికారు. అనంతరం సీఎం వారికి అభినందనలు తెలిపారు.