• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఘనంగా శ్రీ విశాలాక్ష సమేత కాశి విశ్వనాధేశ్వర వార్షికోత్సవం

NLG: శాలిగౌరారం మండలం గురజాల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ విశాలాక్షి సమేత కాశి విశ్వనాధేశ్వర స్వామి దేవాలయం తృతీయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం మండల, గ్రామ కాంగ్రెస్ పార్టీ, ఉత్సవ కమిటీ , గ్రామ సర్పంచ్, పాలకవర్గం, సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

March 5, 2026 / 03:30 PM IST

జిల్లాను టాప్‌లో నిలపండి: కలెక్టర్

GDWL: విద్యార్థుల భవిష్యత్తుకు పదో తరగతి పునాది వంటిదని, ఈ ఏడాది ఫలితాల్లో గద్వాల జిల్లాను రాష్ట్రంలో టాప్ స్థానంలో నిలబెట్టడమే లక్ష్యమని కలెక్టర్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. గురువారం గద్వాల ఐడీవోసీ నుంచి నిర్వహించిన జూమ్ అవగాహన సదస్సులో ఆయన విద్యార్థులకు, ఉపాధ్యా యులకు కీలక సూచనలు చేశారు. విద్యార్థులు ఎండల దృష్ట్యా తగినంత నీరు తాగాలని సూచించారు.

March 5, 2026 / 03:30 PM IST

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీపీ సాయి చైతన్య

NZB: డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బైపాస్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని సీపీ సాయి చైతన్య పరిశీలించారు. అతివేగం, అజాగ్రత్త డ్రైవింగ్ వల్ల ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని ఆయన తెలిపారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.

March 5, 2026 / 03:30 PM IST

వీ-హబ్‌ను పరిశీలించిన కలెక్టర్

PDPL: రంగంపల్లిలో నూతనంగా నిర్మించిన వీ-హబ్ కేంద్రంను త్వరలో ప్రారంభిస్తారని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. గురువారం ఆయన కేంద్ర భవన నిర్మాణాన్ని పరిశీలించారు. ఫర్నీచర్ అందుబాటులో ఉందని, కేంద్రం ద్వారా జిల్లాలోని మహిళలకు వ్యాపార నైపుణ్య శిక్షణ అందించనుందన్నారు. కేంద్రం త్వరలో ప్రారంభించడానికి సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.

March 5, 2026 / 03:30 PM IST

సూర్యాపేట ప్రగతికి 99 రోజుల కార్యాచరణ

SRPT: జిల్లాలో 99 రోజుల ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు పారిశుధ్యం, ఆరోగ్యం, వ్యవసాయం, విద్య వంటి 10 ప్రధానాంశాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, మహిళా సాధికారతపై దృష్టి సారించాలని అన్నారు.

March 5, 2026 / 03:30 PM IST

ఇంటర్ పరీక్షకు 220 మంది విద్యార్థులు గైర్హాజరు

NRML: ఇంటర్మీడియట్ పరీక్షలలో భాగంగా గురువారం నిర్వహించిన ప్రధమ సంవత్సరం గణితం, జంతు శాస్త్రం చరిత్ర పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసినట్లు డీఐఈఓ పరశురాం తెలిపారు. మొత్తం 6358 మంది విద్యార్థులకు గాను 6138 మంది పరీక్ష రాశారని 220 మంది గైర్హాజరయ్యారని వారు వెల్లడించారు.

March 5, 2026 / 03:26 PM IST

గ్రామ స్థాయి బాలల రక్షణ కమిటీ ఏర్పాటు

NRPT: ఉట్కూర్ మండలం పెద్దజట్రం గ్రామంలో గురువారం గ్రామస్థాయి బాలల సంక్షేమం, రక్షణ కమిటీ ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ వెంకటేష్ తెలిపారు. విజన్ ఆర్గనైజేషన్ షాహిన్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కమిటీలో పంచాయతీ సెక్రటరీ బబిత, ఉప సర్పంచ్ స్వాతి పవన్ కుమార్ తదితరులు ఉన్నారు. గ్రామంలో బాలల సంక్షేమానికి, రక్షణకు చర్యలు తీసుకుంటామని సర్పంచ్ అన్నారు.

March 5, 2026 / 03:25 PM IST

ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలు

NGKL: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు నోడల్ అధికారి వెంకట్ రమణ తెలిపారు. గురువారం జరిగిన ఇంటర్ పరీక్షలకు మొత్తం 6,211 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 5,963 మంది విద్యార్థులు హాజరైనట్లు వెల్లడించారు. 248 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

March 5, 2026 / 03:25 PM IST

ఉపాధి హామీ పనులను ప్రారంభించిన సర్పంచ్

KNR: సైదాపూర్ మండలం లస్మన్నపల్లి గ్రామంలో గురువారం సర్పంచ్ మ్యాకల స్వప్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చాలకుంట్ల చేపల పెంపకం కోసం ఫిష్ పార్ట్ పనులను చేపట్టారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బైరి రాజు, సీనియర్ మేటి రేగుల మధుకర్, పెసరు తిరుపతి, మొలుగూరి తిరుపతి, తదితరులు ఉన్నారు.

March 5, 2026 / 03:17 PM IST

రోడ్లు విస్తరణ పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

ఖమ్మం అభివృద్ధిలో భాగంగా ఎఫ్‌సీఐ గోడౌన్ సమీపంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య గురువారం పరిశీలించారు. మెరుగైన రవాణా వ్యవస్థ కోసం చేపట్టిన ఈ పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్ణీత గడువులోగా మట్టి పనులు పూర్తి చేయాలని సూచించారు.

March 5, 2026 / 03:15 PM IST

ఉమ్మడి ఆదిలాబాద్‌లో దంచికొడుతున్న ఎండలు

ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ వేడిమి తట్టుకోలేక ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం 35 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో మూడు రోజుల్లో 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

March 5, 2026 / 03:15 PM IST

ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం

MBNR: మహబూబ్ నగర్‌లోని SBI, RSETI శిక్షణ కేంద్రంలో భారత ప్రభుత్వం యువజన సర్వీసు, క్రీడల ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలపై వర్క్ షాప్ నిర్వహించారు. జిల్లా పరిశ్రమలశాఖ అధికారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన అవసరమన్నారు. కార్యక్రమంలో SBI, RSETI సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్, యువజన అధికారి కోటా నాయక్ పాల్గొన్నారు.

March 5, 2026 / 03:14 PM IST

బకాయిల చెల్లించాలని రైతులు ధర్నా

MHBD: గంగారం మండలం పెద్దఎల్లాపురంలో 234 మంది రైతులు, తమ మొక్కజొన్న ధాన్యంను పీఏసీఎస్‌లో అమ్మి రెండు నెలలు దాటిన ఇప్పటివరకు చెల్లింపు అందకపోవడంతో గురువారం రోడ్డుపై ధర్నా చేశారు. రైతుల బకాయిల మొత్తం సుమారు 5 కోట్లు అయ్యాయి. పెండింగ్ చెల్లింపులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం కోరారు,లేకపోతే అప్పుల వడ్డీలు పెరుగుతున్నాయని అవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 5, 2026 / 03:06 PM IST

కలెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకువెళ్లిన సర్పంచ్

BDK: మణుగూరు ప్రభుత్వ దవాఖానాను సందర్శించే నేపథ్యంలో వెళ్లిన జిల్లా కలెక్టర్ అంకిత్‌ను సమితి సింగారం గ్రామపంచాయతీ సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ సురేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పంచాయతీలోని పలు సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హమీ ఇచ్చారు.

March 5, 2026 / 03:06 PM IST

గోదావరి పుష్కరాల కమిటీలో అడ్లూరికి చోటు

JGL: గోదావరి – 2027 పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన 9 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (G.O.Rt.No.319) ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ కమిటీలో మంత్రి లక్ష్మణ్ కుమార్‌ను సభ్యులుగా నియమించారు.

March 5, 2026 / 03:05 PM IST