• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పుష్కర ఘాట్‌లను పరిశీలించిన ఎస్పీ

MLG: రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా ములుగు జిల్లాలోని ప్రధాన పుష్కర ఘాట్ లను జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ పరిశీలించారు. చుంచుపల్లి, పోదుమూరు, రామన్నగూడెం, ముళ్లకట్ట పుష్కర ఘాట్‌లను సందర్శించిన ఆయన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, సురక్షితంగా పుష్కర స్నానాలు చేయడానికి అన్ని శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు.

March 5, 2026 / 04:52 PM IST

రేపు ప్రత్యేక మెగా వైద్య శిభిరం

ADB: నేరడిగొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(PHC)లో శుక్రవారం ప్రత్యేక మెగా వైద్య శిభిరాన్ని నిర్వహిస్తున్నట్లు హెచ్ఈఓ పవార్ రవీందర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ 99 రోజుల పాటు చేపడుతున్న ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా RIMS ఆసుపత్రి వైద్యులు రానున్నారని పేర్కొన్నారు. ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి కృష్ణరావు హాజరవుతారన్నారు.

March 5, 2026 / 04:51 PM IST

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం

SRCL: ముస్తాబాద్ మండలంలోని గూడెం గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. కళ్యాణోత్సవంలో భాగంగా ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక ఏర్పాటు చేసి వేదమంత్రోచనాల మధ్య కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

March 5, 2026 / 04:50 PM IST

రామ్మూర్తి కుటుంబానికి ఎర్రబెల్లి పరామర్శ

MHBD: పెద్దవంగర మండలంలోని గంట్లకుంట గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు గుర్రం రామ్మూర్తి పెద్ద కుమారుడు గుర్రం సంతోష్ ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇవాళ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అన్ని విధులుగా పార్టీ ఆండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

March 5, 2026 / 04:49 PM IST

‘ఉపాధ్యాయులు విద్యార్థులపై దృష్టి సారించాలి’

BDK: పదో తరగతి విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాధికారిణి నాగలక్ష్మి సూచించారు. బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర ఉన్నత పాఠశాలను గురువారం పరిశీలించారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించి సన్నద్ధం చేయాలన్నారు. అనంతరం తరగతి గదులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

March 5, 2026 / 04:48 PM IST

సీఎం సలహాదారు పదవికి వేం నరేందర్ రెడ్డి రాజీనామా

HYD: సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో, గురువారం ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. అనంతరం హైదరాబాద్‌లో రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

March 5, 2026 / 04:47 PM IST

గ్రామంలో కుక్కల బెడద.. నివారణ చర్యలు

BDK: చిన్నారులు, వృద్ధులు, వాహనదారుల భద్రత దృష్ట్యా కుక్కల బెడద నివారణ చర్యలు చేపడుతున్నామని సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు తెలిపారు. దమ్మపేటలో వీధి కుక్కల బెడద పెరగడంతో గ్రామ పంచాయతీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గురువారం ఖమ్మం నుంచి నిపుణుల బృందాన్ని రప్పించి, ఆధునిక వలలతో కుక్కలను సురక్షితంగా పట్టుకొని కోదాడ డంప్ యార్డుకు తరలిస్తున్నారు.

March 5, 2026 / 04:46 PM IST

‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలి’

JGL: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాయికల్ ఎంపీడీఓ చిరంజీవి పేర్కొన్నారు. మార్చి 6–15 మధ్య నిర్వహించనున్న కార్యక్రమంపై మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు గురువారం అవగాహన కల్పించారు. తహశీల్దార్ నాగార్జున, ఎంపీఓ సుష్మ, ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

March 5, 2026 / 04:45 PM IST

శ్రీరాంపూర్ హెచ్‌ఎంగా వెంకటేశం బాధ్యతలు స్వీకరణ

PDPL: శ్రీరాంపూర్ మండలంలోని ZPHS శ్రీరాంపూర్ పాఠశాల హెచ్‌ఎంగా నూతన బాధ్యతలు స్వీకరించిన బి. వెంకటేశంను జిల్లా శాఖ అధ్యక్షులు అత్తె రాజారాం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కాంప్లెక్స్ స్థాయిలో విద్యా కార్యక్రమాల్లో పరస్పర సహకారంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్యాం కుమార్, తదితరులు పాల్గొన్నారు.

March 5, 2026 / 04:44 PM IST

ఇంటర్ పరీక్షలు.. 506 మంది గైర్హాజరు

SGR: జిల్లా వ్యాప్తంగా 53 కేంద్రాల్లో గురువారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 16,092 మంది విద్యార్థులకు గాను 15,586 మంది (96.86%) హాజరయ్యారు. 506 మంది ఆబ్సెంట్ అయ్యారని జిల్లా విద్యాధికారి గోవింద్ రామ్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశామని, విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాశారు.

March 5, 2026 / 04:42 PM IST

UPDATE: గుర్తుతెలియని కళేబరం.. గట్టయ్యగా గుర్తింపు

HNK: ఐనవోలు(M) సింగారం శివారులో ఊరి చెరువులో గుర్తుతెలియని వ్యక్తి కళేబరం పడి ఉండగా, గ్రామస్తుల సమాచారంతో గ్రామ కార్యదర్శి  అనిల్ కుమార్ పీస్‌లో ఫిర్యాదు చేసారు. SI శ్రీనివాస్ కేసు నమోదు చేసి విచారణ చేశారు. మృతదేహం తిమ్మాపూర్ రామాలయంలోని యాచకుడు గట్టయ్య కళేబరంగా ధృవీకరించారు. అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహిస్తామని ఎస్సై తెలిపారు.

March 5, 2026 / 04:37 PM IST

‘ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే క్రమశిక్షణ అవసరం’

ADB: ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే కృషి, క్రమశిక్షణ, పట్టుదల అవసరమని ఉట్నూర్ ITDA PO యువరాజ్ మర్మాట్ ఆశ్రమ పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి పేర్కొన్నారు. గురువారం ఉట్నూర్‌లో నిర్వహించిన “ఇగ్నిట్ యువర్ డ్రీమ్స్”మోటివేషన్, కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని, కఠిన శ్రమతో ముందుకు సాగాలని సూచించారు.

March 5, 2026 / 04:37 PM IST

ఒడిలో బిడ్డతో విధులు నిర్వహణ

BDK: పాల్వంచ మండలం బసవతారక కాలనీలోని ఆధార్ సేవా కేంద్రంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్న భూక్యా వెన్నెల తన విధి పట్ల అంకితభావాన్ని చాటుతున్నారు. ఏడాది వయసున్న చిన్నారిని ఒడిలో పెట్టుకుని ప్రజలకు ఆధార్ సేవలు అందిస్తున్నారు. రోజూ పెద్ద సంఖ్యలో వచ్చే ప్రజలకు సహనంతో సేవలు అందిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఆమె తల్లితనంతో పాటు విధి నిర్వాహణను నిర్వహిస్తున్నారు.

March 5, 2026 / 04:33 PM IST

‘వేధింపులకు భయపడొద్దు..ఫిర్యాదు చేయండి’

SRCL: విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైనప్పుడు భయపడకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే గురువారం సూచించారు. ఫిర్యాదు అందిన వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళల భద్రత కోసం షీ టీమ్ ప్రత్యేకంగా పనిచేస్తూ విద్యా సంస్థలు, పని ప్రదేశాల్లో ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో చట్టంపై అవగాహన నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

March 5, 2026 / 04:31 PM IST

‘వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి సహకరించాలి’

SRPT: కోదాడ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి మున్సిపల్ ఛైర్ పర్సన్, వార్డు కౌన్సిలర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్ కోరారు. గురువారం కోదాడ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో 35 వార్డుల కౌన్సిలర్లకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

March 5, 2026 / 04:30 PM IST