• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఆయుర్వేద ఆసుపత్రిలో ప్రజా పాలన

MDK: తూప్రాన్ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో ఇవాళ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టారు. సీనియర్ వైద్యాధికారి డాక్టర్ రాణి శర్మ ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించి ఆస్పత్రి పరిసరాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ బ్లెస్సీ, జూనియర్ అసిస్టెంట్ సురేష్, ఫార్మసిస్ట్ వెంకటేశ్వర్ గౌడ్, సౌజన్య, వెంకటరమణ, కవిత పాల్గొన్నారు.

March 7, 2026 / 02:18 PM IST

రోడ్డుకు ఇరువైపులా చెట్లను తొలగించిన తహసీల్దార్

BDK: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఇవాళ మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించారు. తహసీల్దార్ నరేష్ , డీటీ రామారావు, ఆర్ఐ గోపి పాల్గొని శేషగిరి నగర్ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను, డ్రైనేజీను శుభ్రం చేసి, చెత్తకుప్పలను ట్రాక్టర్లలోకి ఎత్తారు.

March 7, 2026 / 02:17 PM IST

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన పీడీ

NRPT: ఊట్కూర్ మండల కేంద్రంలో శనివారం హౌసింగ్ పీడీ శంకర్ పర్యటించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని ఆయన స్వయంగా పరిశీలించారు. స్లాబ్లు పూర్తైన లబ్ధిదారులు మిగిలిన పనులను వేగవంతం చేసి త్వరగా గృహప్రవేశాలు చేయాలని సూచించారు. పనుల్లో జాప్యం చేయకుండా నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.

March 7, 2026 / 02:17 PM IST

ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

NGKL: జిల్లా కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవీఎంల భద్రత, సీసీ కెమెరాల పనితీరును స్వయంగా పరిశీలించారు. ఎలాంటి లోపాలు తలెత్తకుండా గోదాము వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని, నిత్యం అప్రమత్తంగా పర్య వేక్షించాలని అక్కడి భద్రతా సిబ్బందిని ఆదేశించారు.

March 7, 2026 / 02:17 PM IST

మంత్రికి యాదవ సంఘం నాయకులు వినతి

నల్గొండ పట్టణంలోని పానగల్ వద్ద గతంలో యాదవ సంఘానికి కేటాయించిన స్థలాన్ని పూర్తిగా తమకే అప్పగించాలని కోరుతూ ఎమ్మెల్సీ సత్యం ఆధ్వర్యంలో సంఘం నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో వినతిపత్రం అందజేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.

March 7, 2026 / 02:15 PM IST

మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలి: ZP CEO

WGL: నల్లబెల్లి మండలంలోని కొండయిపల్లి GPలో నిర్వహిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పనులను జడ్పీ సీఈవో రాం రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతి, కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన HIT TVతో మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులకు వచ్చే కార్మికులకు తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

March 7, 2026 / 02:15 PM IST

జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని వినతి

KMM: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు బీ.మనోజ్ మాట్లాడుతూ.. కళాశాల లేకపోవడంతో విద్యార్థులు ఖమ్మం వెళ్లాల్సి వస్తోందని, ఇది పేద విద్యార్థులకు ఆర్థిక భారంగా మారుతోందని తెలిపారు.

March 7, 2026 / 02:13 PM IST

స్మశాన వాటిక పనులను ప్రారంభించిన సీతక్క

MLG: ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామ శివారులో శ్మశాన వాటిక నిర్మాణ పనులను శనివారం రాష్ట్ర మంత్రి సీతక్క కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తొందరలోనే శ్మశాన వాటిక నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భానోత్ రవిచందర్, మార్కెట్ ఛైర్మన్ కళ్యాణి, సర్పంచ్ ఇస్లావత్ పులమ్మ-సంతోష్ ఉన్నారు.

March 7, 2026 / 02:12 PM IST

షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం

NRML: జిల్లా కేంద్రంలోని పాత బస్‌స్టాండ్ వద్ద ఉన్న సంతోష్ కలర్ ల్యాబ్‌లో శనివారం షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే నష్టం వివరాలు తెలిసే అవకాశం ఉంది.

March 7, 2026 / 02:08 PM IST

పది పరీక్షలకు 696 మంది విద్యార్థులు

నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలంలో పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంఈవో రాములు తెలిపారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే ఈ పరీక్షల కోసం మండలంలో సిరికొండ, మోడల్ స్కూల్, వాల్గోట్, కొండాపూర్లలో 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 696 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

March 7, 2026 / 02:05 PM IST

పరీక్ష రాసి.. అదృశ్యమై విద్యార్థి మృతి

KMR: బిచ్కుందలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకాశం.. స్థానిక మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ముజాహిద్ గురువారం వార్షిక పరీక్ష రాశాడు. పరీక్ష ముగిసిన అనంతరం అతడు అదృశ్యమయ్యాడు. దీంతో ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే ముజాహిద్ శనివారం పెద్దదడిగి గ్రామం సమీపంలోని కౌలాస్ నాలా కాలువలో శవమై కనిపించాడు.

March 7, 2026 / 02:05 PM IST

VIDEO: యాదాద్రి గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి: ఈవో

BHNG: శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా రేపు గిరిప్రదక్షిణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు. ఉదయం 5.30 గంటలకు ప్రదక్షణ స్వామివారి కొండ కింద ప్రధాన (పాదాల చెంత) వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలతో ప్రారంభమవుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు.

March 7, 2026 / 02:05 PM IST

‘స్పెషలిస్ట్ ఆరోగ్య సేవలు వినియోగించుకోవాలి’

KNR: ‘ప్రజా ప్రభుత్వం- ప్రగతి పాలన’లో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పీహెచ్సీలలో నిర్వహిస్తున్న స్పెషలిస్ట్ ఆరోగ్య సేవలు జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని డీఎంహెచ్వో డాక్టర్ ప్రమోద్ కుమార్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. రోజుకు ఒక పీహెచ్సీలో గైనకాలజీ, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్, ఆప్తోల్మాలజీ, జనరల్ మెడిసిన్, డెంటల్ సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.

March 7, 2026 / 02:04 PM IST

చీర్ల చందర్ రాజీనామా పత్రాన్ని ఆమోదించిన శివసేన రెడ్డి

WNP: ఇటీవల కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌తో గెలిచి, పార్టీ లైన్ తప్పిన మాజీ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్ రాజీనామా రాసిన పత్రాన్ని ఆమోదించామని, పార్టీకి ఆయనకు ఎలాంటి సంబంధం లేదని జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు అన్నారు.

March 7, 2026 / 02:04 PM IST

చీర్ల చందర్ రాజీనామా పత్రాన్ని ఆమోదించిన జిల్లా అధ్యక్షుడు

WNP: ఇటీవల కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌తో గెలిచి, పార్టీ లైన్ తప్పిన మాజీ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్ రాజీనామా రాసిన పత్రాన్ని ఆమోదించామని, పార్టీకి ఆయనకు ఎలాంటి సంబంధం లేదని జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు అన్నారు.

March 7, 2026 / 02:04 PM IST