• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బాల్య వివాహాలపై అవగాహన సదస్సు

NTR: ఉట్కూర్ మండలం అంబేడ్కర్ కళాభవన్‌లో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థపై అవగాహన సదస్సు నిర్వహించారు. పారా లీగల్ వాలంటీర్ ఎస్. అంజమ్మ మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని, 18 ఏళ్లు పూర్తయ్యాకే వివాహం చేయాలని తెలిపారు. బాల్య వివాహాలు లేని సమాజం కోసం అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

March 6, 2026 / 09:37 AM IST

నేడు ప్రెస్‌క్లబ్‌లో మంద కృష్ణ మాదిగ ప్రెస్ మీట్

HYD: MRPS అధినేత మంద కృష్ణ మాదిగ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు MRPSనాయకులు తెలిపారు. ఇటీవలే రాష్ట్రంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఎస్సీ సామాజిక వర్గం నుంచి అవకాశం కల్పించాలని కోరగా కాంగ్రెస్ పార్టీ కేటాయించకపోవడం పట్ల ఈ సమావేశం నిర్వహించినట్లు సమాచారం.

March 6, 2026 / 09:37 AM IST

మోత్కూర్ బృందావని కాల్వకు మోక్షం ఎప్పుడో…?

BHNG: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని 1, 2 ,9 వార్డుల గుండా వెళ్లే బృందావన్ కాలువ దశాబ్ద కాలంగా మరమతులకు నోచుకోక అధ్వానంగా తయారయింది. తూములు, సైడ్ వాల్‌లు, దెబ్బతిని, కాల్వలో పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో వర్షాకాలంలో నీరు ఇళ్లలోకి చేరుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం రాకముందే ఈ వేసవిలో అధికారులు స్పందించాలన్నారు.

March 6, 2026 / 09:30 AM IST

ఇసుక ట్రాక్టర్ పట్టివేత.. కేసు నమోదు

SRPT: మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన బూదరపు ఉపేందర్ తన ట్రాక్టర్ ద్వారా ముకుందాపురం శివారులోని పాలేరు వాగు నుంచి అక్రమంగా మద్దిరాలకు ఇసుకను తరలిస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్ఐ వీరన్న హెచ్చరించారు.

March 6, 2026 / 09:29 AM IST

బోర్లకు మర్మమత్తు చెేపట్టిన సర్పంచ్

WGL: రాయపర్తి మండలం శివరామపురంలో తాగునీటి బోర్ల మోటార్లకు శుక్రవారం మర్మమత్తుల కార్యక్రమం చేపట్టారు. సర్పంచ్ పెద్దగోని నాగరాజుగౌడ్ వార్డు సభ్యులు, గ్రామస్తుల సహకారంతో చెడిపోయిన మోటార్లను బయటకు తీసి వాటిని రిపేర్ చేశారు. అనంతరం మళ్లీ బోర్లలో మోటార్లను బిగించి నీటి సరఫరాను పునరుద్ధరించారు. సకాలంలో చర్యలు తీసుకోవడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.

March 6, 2026 / 09:29 AM IST

జిల్లాలో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో శుక్రవారం రోజున కళ్యాణ లక్ష్మీ చెక్కుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ కంది తిరుపతిరెడ్డి వైస్ ఛైర్మన్ బంక చందు తోటపల్లి సర్పంచ్ బంక లక్ష్మీ గాంధీనగర్ సర్పంచ్ పోలు సంపత్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొంగోని శ్రీనివాస్ లబ్ధిదారులు, అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.

March 6, 2026 / 09:28 AM IST

నిజామాబాద్ మీదుగా రైళ్ల మళ్లీంపు

NZB: రైల్వే ట్రాఫిక్ బ్లాక్ నేపథ్యంలో కొన్ని రైళ్లకు దారి మళ్లింపు చేసినట్లు CPRO శ్రీధర్ తెలిపారు. మే 3,5వ తేదీల్లో సికింద్రాబాద్-దానాపూర్ (12791) ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట జంక్షన్ మార్గం కాకుండా సికింద్రాబాద్-NZB-పెద్దపల్లి మార్గం మీదుగా నడిపించనున్నారు. మే 4న యశ్వంత్‌పూర్-లక్నో 22683 ఎక్స్‌ప్రెస్‌ను కాచిగూడ-NZB పెద్దపల్లి మార్గంలో దారి మళ్లిస్తున్నారు.

March 6, 2026 / 09:25 AM IST

‘100% ఆస్తి పన్ను వసూలు చేయాలి: మున్సిపల్ ఛైర్‌పర్సన్

MDK: ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో 100% ఆస్తి పన్ను వసూలు చేయాలని మెదక్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతి రాజు అధికారులను ఆదేశించారు. గురువారం వైస్ ఛైర్మన్ దొంతి నరేష్ గౌడ్, రెవెన్యూ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. నిర్ణీత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

March 6, 2026 / 09:24 AM IST

ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం 7కు వాయిదా

NLG: 6వ తేదీన జరగాల్సిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం ఈ నెల 7కు వాయిదా వేసినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. జిల్లాలోని అధికారులు, సిబ్బంది అందరూ సమిష్టిగా పనిచేసి ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలని కోరారు. పరిపాలన పరమైన కారణాల వల్ల సన్నాహక సమావేశం ను వాయిదా వేసినట్లు కలెక్టర్ తెలిపారు.

March 6, 2026 / 09:23 AM IST

నగరంలో 36 గంటలు నీటి సరఫరా బంద్!

HYD: నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి 36 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. మంజీరా ఫేజ్-3, పెద్దాపూర్ పంప్ హౌస్‌లో మరమ్మతులు, ఆధునీకరణ పనుల కారణంగా జలమండలి (HMWSSB) ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మణికొండ, కోకాపేట్, నార్సింగి, షేక్‌పేట్, భోజగుట్ట వంటి ప్రాంతాల్లో తక్కువ ప్రెజర్‌తో నీరు సరఫరా అవుతుందని అధికారులు తెలిపారు.

March 6, 2026 / 09:23 AM IST

ట్రాఫిక్ నియమాలను పాటించడం ఎంతో అవసరం: DM

SRD: రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించడం ఎంతో అవసరమని DM సుబ్రహ్మణ్యం తెలిపారు. నేడు జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ఖేడ్ TGSRTC డిపో ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ప్రజల భద్రత కోసం ప్రభుత్వం చేపడుతున్న రోడ్డు భద్రత కార్యక్రమాలకు సహకరించాలన్నారు.

March 6, 2026 / 09:20 AM IST

ఇంటి వద్ద ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం

MBNR: హన్వాడ మండలం కిష్టంపల్లికి చెందిన గాయత్రి తనకు పురిటి నొప్పులు రావడం వలన 108కి ఫోన్ చేయడం జరిగింది. అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది శ్రీనివాస్ ఇంటి దగ్గరే కాన్పు చేయడం వల్ల ఆమె పండంటి మగ బిడ్డకు జన్మించింది. తల్లి, బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు. వారిని తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించినట్లు పైలెట్ సలీం, శ్రీనివాస్ తెలిపారు.

March 6, 2026 / 09:20 AM IST

పెదనేమిల గ్రామంలో సీసీ రోడ్డు లెవలింగ్ పనులు

SRPT: నూతనకల్ మండలం పెదనేమిల గ్రామంలో సీసీ రోడ్డు ప్రక్కన మట్టిని చదును చేసి పనులు శుక్రవారం వేగంగా సాగుతున్నాయి. రోడ్డుకు రెండు వైపులా ఎత్తుపల్లాలుగా ఉన్న మట్టి వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారారని గుర్తించిన సర్పంచ్.. ట్రాక్టర్ సహాయంతో లెవలింగ్ చేయించారు. దీనివల్ల ఎదురుగా వచ్చి వాహనాలు పక్కకు తప్పుకోవడానికి వీలుంటుందని సర్పంచ్ తెలిపారు.

March 6, 2026 / 09:20 AM IST

వేం నరేందర్‌ను సన్మానించిన డీసీసీ అధ్యక్షుడు

HNK: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వేం నరేందర్ రెడ్డిని కుడా ఛైర్మన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనగాల వెంకటరామిరెడ్డి నేడు హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆయనను కలిసి, పూలబొకే అందజేసి, శాలువా కప్పి సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు విషయాల గురించి వారు చర్చించారు.

March 6, 2026 / 09:15 AM IST

వైర్లను సరి చేసుకోవాలి: పెబ్బేరు ఎస్సై

పాత వైర్లను సరి చూసుకొని అవసరమైతే కొత్త వైర్లను మార్చుకోవాలని పెబ్బేరు ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపారు. చాలావరకు విద్యుత్ షాక్‌తో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అవసరం లేనప్పుడు మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడం ఉత్తమం అని తెలిపారు. రానున్న ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోకుండా మరింత జాగ్రత్త పడాలి అన్నారు.

March 6, 2026 / 09:15 AM IST